Acharya - షూటింగ్ అప్ డేట్స్
Wednesday,March 10,2021 - 05:29 by Z_CLU
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మెగా ఎంటర్ టైనర్ `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ – పూజా హెగ్డే హీరోయిన్లు.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ – కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి- రామ్ చరణ్ నిర్మాతలు.

ఇటీవల ఖమ్మం షెడ్యూల్ తో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడీ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది.
నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ-“ఖమ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి -చరణ్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించాం“ అని తెలిపారు.
ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రెజీనా ఓ ఐటెంసాంగ్ చేసింది.