ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు

Monday,March 01,2021 - 04:20 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆచార్య. టీజర్ తోనే ఈ సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే ప్రచారాన్ని మెల్లమెల్లగా స్పీడప్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటికిందట ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అతడి క్యారెక్టర్ పేరు సిద్ధ. ఆ పాత్రకు సంబంధించిన షేడ్ ను ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో చూపించారు. చరణ్ భుజంపై ఆచార్య చేయి వేసిన సందర్భంలో, ఎదురుగా గన్ కనిపించేలా ఈ పోస్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎగ్రెసివ్ గా ఉంటుందనే విషయాన్ని ఈ స్టిల్ తో చెప్పారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. చిరు-చెర్రీ మధ్య కీలక సన్నివేశాలు తీస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే 13న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.