ఆచారి అమెరికా యాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Friday,November 10,2017 - 04:43 by Z_CLU

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నవంబర్ 23 న రిలీజ్ చేయనుంది. ఈ సినిమాలో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం సినిమాల తరవాత విష్ణు మంచు, డైరెక్టర్ G. నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్  పై   స్పెషల్  ఇంట్రెస్ట్  జెనెరేట్ అవుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి S.S. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.