గ్రాండ్ గా సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,November 10,2017 - 05:36 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజైన ‘బుగ్గంచు’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా నవంబర్ 19 న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది జవాన్ టీమ్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి BVS రవి డైరెక్టర్. ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నాడు. కృష్ణ ప్రొడ్యూసర్.