2 మిలియన్ వ్యూస్ తో 'సాహో' టీజర్ హల్చల్

Friday,April 28,2017 - 04:00 by Z_CLU

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.. నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియా భారీ వ్యూస్ తో హల్చల్ చేస్తూ దూసుకుపోతుంది.. ఒక వైపు రిలీజ్ కి ముందే లీకైనప్పటికీ, మరో వైపు బాహుబలి- 2 సినిమాతో థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ‘సాహో’ టీజర్ కి క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు..

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆ అంచనాలతో రిలీజ్ అయిన సాహో టీజర్ గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతూ ఇట్స్ రికార్డ్ టైం అంటూ దుమ్ము దులిపేస్తుంది…హై టెక్నీకల్ స్టాండర్డ్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ టీజర్ కేవలం ప్రభాస్ ఫాన్స్ ను మాత్రమే కాకుండా స్టార్స్ తో పాటు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.. మరి ప్రెజెంట్ 2 మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ టీజర్ ఇంకా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో.. చూడాలి..