ఎట్టకేలకు తమిళనాట బాహుబలి-2 రిలీజ్

Friday,April 28,2017 - 03:02 by Z_CLU

ప్రపంచం మొత్త బాహుబలి-2 విడుదలైంది, ఒక్క తమిళనాడులో తప్ప. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య వచ్చిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నిన్న రాత్రి బాహుబలి-2 తమిళ వెర్షన్ ప్రీమియర్ రద్దయింది. ఈరోజు ఉదయం కూడా బాహుబలి-2 సినిమా థియేటర్లలోకి రాలేదు. మార్నింగ్ షోలు అన్నీ రద్దయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

వెంటనే స్పందించిన బాహుబలి నిర్మాతలు, తమిళ బయ్యర్లతో చర్చలు జరపడం.. కోలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు వెంటనే చొరవ చూపడంతో ఈరోజు మ్యాట్నీ షో నుంచి తమిళనాట బాహుబలి-2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. తాజా ఇన్ పుట్స్ ప్రకారం.. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో బాహుబలి-2 సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. అటు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.