‘అడవి రాముడు’ సినిమాకి 40 ఏళ్ళు

Friday,April 28,2017 - 05:30 by Z_CLU

1977 ఏప్రిల్ 28 న రిలీజైంది అడవి రాముడు. లెజెండ్రీ యాక్టర్ NTR హీరోగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన  ఈ సినిమా ఇవాళ్టితో సరిగ్గా 40 ఏళ్ళు పూర్తిచేసుకుంది. తెలుగు సినిమా హిస్టరీని తిరగరాసి, కమర్షియల్ సినిమాకు కొత్తదారి చూపించింది ‘అడవి రాముడు’. మహానటుడు N.T.R. కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన ఈ సినిమాలో జయసుధ, జయప్రద హీరోయిన్స్ గా నటించారు.

మద్రాస్ లోని స్టూడియోలో  జనవరి 9 1977 న ఫస్ట్ షాట్ షూట్ చేసుకున్న సినిమా యూనిట్, తర్వాత మొత్తం సినిమాని మదుమలై ఫారెస్ట్ లో షూట్ చేశారు. NTR కరియర్ లో ఫస్ట్ టైం వరసగా 35 రోజుల డేట్స్ ఈ సినిమాకి కేటాయించారు. అంటే ఈ 35 రోజులు అయన హైదరాబాద్ వైపు అసలు రానే లేదు.

దానవీరశూరకర్ణ సినిమా సెట్స్ పై ఉండగానే ‘అడవి రాముడు’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు N.TR. అంతలో దానవీరశూరకర్ణ సినిమా ఆ ఏడాది సంక్రాతిని టార్గెట్ చేయడంతో, అడవి రాముడు షెడ్యూల్స్ వల్ల ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందన్న కారణంతో ‘అడవి రాముడు’ షూటింగ్ కి బ్రేక్ వేశారు NTR. అలా దానవీరశూరకర్ణ సినిమా పూర్తిచేసి, మళ్లీ అడవిలోకి వచ్చేశారు. తిరిగి సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు హైదరాబాాద్ వెళ్లలేదు.

 

అడవి రాముడు సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి కూడా మోస్ట్ మెమోరాబుల్ మూవీ. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఆయన కరియర్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది. ఈ సినిమా సక్సెస్ KRR ని సూపర్ హిట్ డైరెక్టర్స్ జాబితాలో చేర్చింది.

అడవిలో ఏనుగులతో అంత మందితో అన్ని రోజుల పాటు గడపడం అంత ఈజీ కాలేదు సినిమా యూనిట్ కి. అందునా యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించాల్సి వచ్చినపుడు ఒక్కోసారి ఏనుగులు భయపడిపోయి భీభత్సం సృష్టించాయట. అప్పుడు జయసుధ, జయప్రదకు గాయాలవడంతో వారి కాంబినేషన్ లో ఉన్న సీన్స్ ని పోస్ట్ పోన్ చేసుకుని కొన్ని రోజుల తరవాత మళ్ళీ షూటింగ్ జరుపుకుందట సినిమా యూనిట్.

అలా ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించిన అడవి రాముడు సినిమా.. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.