డి16 ట్రైలర్ హంగామా

Thursday,February 16,2017 - 07:16 by Z_CLU

రెహ్మాన్ హీరోగా కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో తమిళ్ లో తెరకెక్కిన ‘దురువంగల్ పతినారు D16′ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 29న విడుదలై కోలీవుడ్లో గ్రాండ్ హిట్ సాధించి ఇప్పటికీ మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఈ సినిమా ’16’ పేరుతో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. నేటితో కోలీవుడ్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చ్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.. మరి ఇప్పటి వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన రెహ్మాన్ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎలాంటి విజయం అందుకుంటాడో… చూడాలి