దండుపాళ్యం-3

Monday,February 26,2018 - 12:09 by Z_CLU

నటీ నటులు : బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే తదితరులు

సంగీతం: అర్జున్‌ జన్యా,

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌,

ఎడిటింగ్‌: రవిచంద్రన్‌,

కో ప్రొడ్యూసర్ – సాయి కృష్ణ పెండ్యాల

నిర్మాతలు:  శ్రీనివాస్ మీసాల, రజనీ తాళ్ళూరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

 

దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండు పాళ్యం చిత్రాలు క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇదే ఊపులో దండుపాళ్యం 3 చిత్రం కూడా రిలీజ్ కు సిద్ధమైంది. శ్రీనివాస రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సెన్సేషనల్ చిత్రం మార్చి2న  తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని క్రేజీ ఆఫర్ ఇచ్చి దక్కించుకోవడం విశేషం. ఈ చిత్ర తెలుగు హక్కులకు ఏర్పడ్డ క్రేజీ దృష్ట్యా ఫ్యాన్స్ రేట్ ఆఫర్ చేసినట్టు నిర్మాతలు చెబుతున్నారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో..  సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో… శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై  శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి  సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. సాయి కృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

Release Date : 20180316