ల‌వ‌ర్‌

Wednesday,February 28,2018 - 11:46 by Z_CLU

నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ది కుమార్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

ఆర్ట్ : ఎ.ఎస్‌.ప్ర‌కాష్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : అనీష్ కృష్ణ

తొలి చిత్రం `ఊయ్యాల జంపాల‌`తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్ట‌కున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ‌, వెంట‌నే సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా హిట్ సినిమా తీయాల‌నే దృక్ప‌థంతో వెయిట్ చేసి మంచి క‌థను త‌యారు చేసుకున్నారు. మంచి క‌థ‌కు త‌గ్గట్లు టెస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు,  యంగ్ హీరో త‌రుణ్ సినిమాకు చ‌క్క‌గా కుదిరారు.  ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం చేస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు.

Release Date : 20180720