దండుపాళ్యం 4 సినిమాపై క్రియేట్ అయిన కన్ఫ్యూజన్

Thursday,March 01,2018 - 01:44 by Z_CLU

దండుపాళ్యం 4 సినిమాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఈ ప్రెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ కూడా పాల్గొనడం విశేషం. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగి 24 గంటలు కూడా గడవక ముందే అసలు దండుపాళ్యం 4 కు తమకు ఏ సంబంధం లేదని, మేకర్స్ తమను సంప్రదించకుండానే ఈ సినిమా  ఫస్ట్ లుక్  లో  తమ ఫోటోను, పేర్లను వాడుకున్నారని వీడియో రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.

దండుపాళ్యం 2 సక్సెస్ తరవాత ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్ కి రెడీ అవుతుంది. మాస్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతంలో రిలీజైన దండుపాళ్యం సిరీస్ లాగే సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. అందుకే అదే స్పీడ్ లో దండుపాళ్యం 4 మూవీ ని అనౌన్స్ చేసింది.

టాలీవుడ్ తో పాటు కన్నడ లోను భారీ డిమాండ్ క్రియేట్ చేసుకుంది దండుపాళ్యం. వెంకట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి K.T. నాయక డైరెక్టర్. మరి ఫిల్మ్ మేకర్స్ అనౌన్స్ చేసినట్టు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా లేదా..? లాంటి క్వశ్చన్స్ కి సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.