P.S.V.గరుడవేగ రివ్యూ

Tuesday,November 07,2017 - 01:44 by Z_CLU

నటీ నటులు : రాజశేఖర్, పూజ కుమార్,అదిత్,కిషోర్, శ్రద్ధ దాస్ తదితరులు

సినిమాటోగ్రఫీ : అంజి

మ్యూజిక్ డైరెక్టర్స్ : శ్రీచరణ్ పాకాల – బీమ్స్ సెసిరోలియో

నిర్మాత : ఎం.కోటేశ్వర రాజు

కథ-స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ప్రవీణ్ సత్తరు

రిలీజ్ డేట్ : 3 నవంబర్ 2017

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో డా.రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుందనగానే ‘PSV గరుడ వేగ’ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి హీరోగా కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడా.. మళ్ళీ మునుపటి ఫామ్ తెచ్చుకున్నాడా..?

కథ :

ఎన్.ఐ.ఎ(నేషనల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ) లో ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు చంద్ర శేఖర్(రాజశేఖర్). అయితే ఉద్యోగరీత్యా కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో భార్య (పూజ కుమార్) అతని నుంచి విడిపోదామనుకుంటుంది. అదే సమయంలో చంద్రశేఖర్ ఒక క్లిష్టమైన కేసును టేకప్ చేయాల్సివస్తుంది. పోలీసులకు దొరక్కుండా అనేక మంది మరణానికి కారణమైన హ్యాకర్(అదిత్) ను పట్టుకునే బాధ్యతను చంద్రశేఖర్ కు అప్పగిస్తుంది డిపార్ట్మెంట్. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు..అతని వెనకున్నదెవరు..? అణుబాంబులతో అమాయకులైన ప్రజల్ని చంపాలనే కుట్రను చంద్రశేఖర్  ఎలా భగ్నం చేశాడు.. అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు :

ఇప్పటికే ఎన్నో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన డా. రాజశేఖర్ మరోసారి తనదైన శైలి నటనతో ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా సూపర్బ్ అనేలా చేశాడు. ఇలాంటి పాత్రలకి పర్ఫెక్ట్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ముఖ్యంగా ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలా రాజశేఖర్ కష్టపడిన తీరును అభినందించాల్సిందే. రాజశేఖర్ భార్యగా పూజా కుమార్ తన నటనతో ఆకట్టుకుంది. హ్యాకర్ గా అదిత్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. స్పెషల్ సాంగ్ తో సన్నీ లియోన్ సినిమాకు హైలైట్ గా నిలవగా… న్యూస్ రిపోర్టర్ గా శ్రద్ధా దాస్ , విలన్ గా కిషోర్, నాజర్, రవి వర్మ, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

హై టెక్నికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు తమ వర్క్ తో హైలైట్ గా నిలిచారు. ముఖ్యంగా అంజి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎస్సెట్. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. శ్రీ చరణ్ పాకాల, భీమ్స్ కంపోజ్ చేసిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. యాక్షన్ పార్ట్ సినిమాకు మరో హైలైట్. ముఖ్యంగా డార్జిలింగ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాజశేఖర్ క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో  మెస్మరైజ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

రిలీజ్ కి ముందే టీజర్, ట్రయిలర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేసిన ప్రవీణ్ సత్తారు.. ఆ అంచనాలను అందుకున్నాడు. తనదైన మేకింగ్, స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా కథ – స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని దానికి హై టెక్నికల్ వాల్యూస్ యాడ్ చేయడంలో ప్రవీణ్ సక్సెస్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ స్టేజిలో ఈ కథను ఐదు పదుల వయసున్న రాజశేఖర్ డీల్ చేయగలడా….? అనుకున్న వాళ్ళకి తన నటనతో సమాధానం చెప్పి ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కి తనే పర్ఫెక్ట్ అని మళ్ళీ రుజువు చేసుకున్నాడు డా. రాజశేఖర్.  స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ లో ఉన్న వేగం, సెకెండాఫ్ లో కనిపించలేదు.

రాజశేఖర్ క్యారెక్టర్, స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, స్టైలిష్ యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, సన్నీ లియోన్ సాంగ్, హాలీవుడ్ స్టైల్ మేకింగ్ , ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, ఇరికించినట్టుగా ఉండే కామెడి, కాస్త డ్రాగ్ అనిపించడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా ‘PSVగరుడ వేగ’ హై టెక్నికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : /5