'అదిరింది' మూవీ రివ్యూ

Thursday,November 09,2017 - 04:29 by Z_CLU

నటీనటులు : విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యరాజ్, సత్యన్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

సినిమాటోగ్రాఫర్ : జి.కె.విష్ణు

ఎడిటర్ : రుబన్

యాక్షన్ : అనల్ అరసు

స్క్రీన్ ప్లే : అట్లీ- విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్

నిర్మాతలు – మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్

రిలీజ్ : నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

కథ – స్క్రీన్ ప్లే-డైరెక్షన్ : అట్లీ

 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 61వ ప్రతిష్టాత్మక చిత్రం ‘మెర్సల్’. కోలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో ‘అదిరింది’ గా ఈరోజే విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.

కథ :

వైద్యం వ్యాపారం కాకూడదని భావించే భార్గవ్(విజయ్) కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తూ ఇండియాలో గొప్ప డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. అలాగే తన ఇంద్రజాలంతో దేశంలోనే గొప్ప మెజీషియన్ గా క్రేజ్ తెచ్చుకుంటాడు విజయ్(విజయ్).. ఈ క్రమంలో పెద్ద డాక్టర్ గా పేరొందిన డానియల్(ఎస్ జె సూర్య)తో కలిసి వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని నిరుపేదల దగ్గర డబ్బు గుంజుకుంటున్న కొందరు డాక్టర్లు కిడ్నాప్ చేయబడి చనిపోతారు. అయితే వారిని చంపింది డాక్టర్ భార్గవా? లేక మెజీషియన్ విజయా? ఒకేలా ఉండే వీరిద్దరూ ఎమవుతారు? చివరికీ వీరిద్దరూ కలిసి అందరికీ ఉచిత వైద్యం అందాలని కోరుకునే విజయ్ భార్గవ్(విజయ్) చివరి ఆశని ఎలా నెరవేర్చారు.. డానియల్ ను ఎలా అంతమొందించారు … అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూడు విభిన్న పాత్రలతో ఎంటర్టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా తనకి పట్టున్న ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా సూపర్ అనిపించుకున్నాడు. నిత్యామీనన్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కాజల్ – సమంత గ్లామరస్ క్యారెక్టర్స్ తో ఫరవాలేదనిపించుకున్నారు. తన డిఫరెంట్ విలనిజంతో విలన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ఎస్.జె.సూర్య మరోసారి స్టైలిష్ విలన్ గా అదుర్స్ అనిపించాడు. వడివేలు, సత్య రాజ్, హరీష్, సురేఖ వాణి తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ‘మాయో’ సాంగ్ మినహా మిగతా పాటలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ పరవాలేదు కానీ తెలుగు వెర్షన్ కు ఇంకాస్త ట్రిమ్ చేసినట్టయితే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. అట్లీ స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే – మేకింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వైద్యరంగంలో ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి వచ్చే డైలాగ్స్ ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించాయి. తేనాండాళ్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘మెర్సల్’ సినిమా తెలుగులో ‘అదిరింది’గా విడుదలవుతుందనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో అవినీతి గురించి దర్శకుడు అట్లీ కాస్త లోతుగానే చర్చించాడనే టాక్ కోలీవుడ్ నుంచి కాస్త ముందుగానే రావడంతో తెలుగులో విజయ్ నటించిన ఏ సినిమాకు దక్కని క్రేజ్ దీనికి వచ్చింది.

అయితే ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్స్ చేయడం, రెహ్మాన్ మ్యూజిక్ అందించడం , ప్రెజెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న మోసాలతో కూడిన స్టోరీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఇక సినిమా విషయానికొస్తే ప్రస్తుతం వైద్య రంగంలో జరుగుతున్న మోసాలు, అవకతవకలపై కథ తయారుచేసుకొని దానికి విజయేంద్ర ప్రసాద్, రమణ వంటి రచయితల సహకారంతో అదిరిపోయే స్క్రీన్ ప్లే రెడీ చేసి అదుర్స్ అనిపించాడు అట్లీ.

చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ ఈ సినిమాతో బడా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయే టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు అట్లీ. సినిమా స్టార్టింగ్ నుంచే తను చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్తూ కొన్ని ఎమోషనల్ సీన్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశాడు. విజయ్ చేసిన మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, బ్యాగ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్, కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

అక్కడక్కడ బోర్ కొట్టించే సీన్స్, సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్, సెకండాఫ్ లో సాగదీసేలా అనిపించే స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్.. ఓవరాల్ గా అదిరిపోయే మెసేజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అదిరింది.

 

రేటింగ్ : 3/5