ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ

Wednesday,November 01,2017 - 12:55 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటించిన PSV గరుడవేగ 126.18M నవంబర్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. రాజశేఖర్ NIA ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ తో పాటు సినిమాలోని మరిన్ని  ఇంటరెస్టింగ్ పాయింట్స్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఆ చిట్ చాట్ మీ కోసం…

 

బాండ్ సినిమా అనుకోలేదు…

ట్రైలర్ చూస్తే బాండ్ సినిమాలా అనిపిస్తుందేమో కానీ మరీ అలాంటి సినిమా చేయాలని అనుకోలేదు. ‘డై హార్డ్’ లాంటి సినిమా చేయాలనుకున్నా… బ్రూస్ లీ సినిమాలాంటి సినిమా అనుకోవచ్చు…

 

సినిమాలో కీ ఎలిమెంట్ అదే…

అందరిలో ‘PSV గరుడవేగ’ అంటే ఏమిటనే క్యూరాసిటీ ఆల్ రెడీ రేజ్ అయిపోయింది. నిజానికి సినిమాలో ఉండబోయే సస్పెన్స్ అండ్ కీ ఎలిమెంట్ అదే…

 

రాజశేఖర్ గారి కోసం అనుకోలేదు…

కథ ఈ హీరోతోనే చేయాలి అనుకుని రాసుకోలేదు.. 2006 లోనే రెడీ చేసుకున్న కథ ఇది… కాకపోతే రాజశేఖర్ గారితో చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఇమేజ్ కి, బాడీ లాంగ్వేజ్ కి, ఏజ్ కి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాను…

 

ముంబై దాడుల తర్వాత….

2008 లో ముంబై దాడులు జరిగిన తర్వాత NIA ఏర్పడింది. ఈ సినిమాలో హీరో NIA ఆఫీసర్. వీరి రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది..? ఇంట్రెస్టింగ్ సీక్రెట్ మిషన్… వీటి మధ్య సినిమా రన్ అవుతూంటుంది.

 

యాక్షన్ సీక్వెన్సెస్ నేనే డిజైన్ చేశాను…

సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ నేనే డిజైన్ చేశాను. కొరియోగ్రఫీ వేరు.. డిజైనింగ్ వేరు.. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లలోను స్టోరీ రన్ అవుతూంటుంది. ఏదో హీరోని ఎలివేట్ చేయడం కోసమో, లేకపోతే మాస్ ఫీల్ కోసమో కాకుండా అన్యాచురాల్ గా యాక్షన్ కూడా స్టోరీతో పాటే ట్రావెల్ చేస్తూంటుంది.

 

బడ్జెట్ కి డైరెక్టర్ తో సంబంధం ఉండదు…

ఏ సినిమా కైనా స్క్రిప్ట్ ని బట్టి సినిమాను ఎన్ని రోజుల్లో తీయగలమో డైరెక్టర్ చెప్తే, కథను బట్టి రిక్వైర్ మెంట్ ని బట్టి ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందో లైన్ ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేస్తారు… బడ్జెట్ కి డైరెక్టర్ కి ఎటువంటి సంబంధం ఉండదు.

 

రాజశేఖర్ గారి ఏ సినిమాకి స్క్రిప్ట్ లేదు…

రాజశేఖర్ గారి కరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు స్క్రిప్ట్ లేదు… ఇదే ఫస్ట్ మూవీ… ఒకసారి స్క్రిప్ట్ చేతిలో పెట్టాక ఇక స్టోరీ న్యారేషన్ కన్విన్స్ చేయడం లాంటివి ఇక అవసరం ఉండదు.. కొందరు స్నిమాను అద్భుతంగా న్యారేట్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ వరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతుంటారు.. ఏదైతే అనుకున్నామో ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకోగలిగాం అంటే… డ్యూరేషన్ వరకు తెలిసిపోతుంది.

 

జార్జియా వెళ్ళడానికి రీజన్ అదే…

శ్రీశైలం డ్యామ్ పై ఫ్లైట్ వెళ్తుంటే 10 ప్యారాషూట్స్ ల్యాండ్ అవ్వాలి.  వైజాగ్ నుండి రెండు స్పీడ్ బోట్స్ తీసుకుని వచ్చి రిజర్వాయర్ లో పెట్టాలి. డ్యామ్ పై మిషన్ గన్స్ తో షూట్ చేయాలి. డ్యామ్ లోపల పది, పదిహేను బాంబులు పెట్టి, 15 మిషన్ గన్స్ తో మనుషులను చంపాలి… ఇది సీన్.. దీనికి మనవాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి జార్జియాకి వెళ్లి షూట్ చేసుకుని రావాల్సి వచ్చింది. కాకపోతే కథ మొత్తం ఇండియాలోనే జరుగుతుంది.

 

హుమా ఖురేషి అనుకున్నాను…

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ స్పేస్ లో నేను ఫస్ట్ నుండి హుమా ఖురేషి అనుకుంటూ ఉన్నాను, కానీ ప్రొడ్యూసర్స్ సన్నీలియోన్ అయితే క్రేజ్ క్రియేట్ అవుతుంది అని సజెస్ట్ చేయగానే ఇంకా మంచిదే అనిపించింది…