'కాష్మోరా' మూవీ రివ్యూ...

Friday,October 28,2016 - 03:08 by Z_CLU

నటీ నటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య తదితరులు…

సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్‌
మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
ఆర్ట్‌ : రాజీవన్‌
ఎడిటింగ్‌ : వి.జె.సాబు జోసెఫ్‌
నిర్మాతలు : పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గోకుల్‌
విడుదల తేదీ : 28-10-16

ఊపిరి లాంటి స్ట్రయిట్ సినిమాతో తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు కార్తి. అప్పటికే ఉన్న ఇమేజ్ ను ఊపిరి ఇంకాస్త పెంచడంతో… కాష్మారాపై అంచనాలు పెరిగాయి. అందుకే కార్తి కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో కాష్మారా సినిమా విడుదలైంది. ఓవైపు కాష్మారాలో గ్రాఫిక్స్ మగధీరను తలపిస్తాయనే అంచనాలు, మరోవైపు నయనతార అందాలు ప్రత్యేక ఆకర్షణగా ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

kashmora_1600x1067

కథ :-

ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓ పాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం.

నటీ నటుల పనితీరు :-

ఓ వైపు కాష్మోరా గా మరోవైపు రాజ్ నాయక్ పాత్రలో అలరించి తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు కార్తీ. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో వన్ మన్ షో గా కథను ముందుకు నడిపించాడు. రత్నమహాదేవిగా నయనతార ఆకట్టుకుంది. ఆత్మల మీద పరిశోధన చేసే అమ్మాయి పాత్రకు శ్రీదివ్య న్యాయం చేసింది. వివేక్ తనదైనన కామెడీతో కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. మిగతా వారందరూ తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :-

సినిమాకు తన సినిమాటోగ్రఫీ తో అందం తీసుకొచ్చాడు కెమెరామెన్ ఓం ప్రకాష్‌. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు లొకేషన్స్ ను చూపించిన తీరు ఆకట్టుకుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం ఫరవాలేదు. రాజీవన్‌ ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. సెకండ్ హాఫ్ లో అన్‌బారివ్‌ సమకూర్చిన యుద్ధ సన్నివేశం అలరించింది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. దర్శకుడు గోకుల్‌ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

kashmora-9_1561x1200

జీ సినిమాలు సమీక్ష :-

పాత రివేంజ్ ప్రేతాత్మ కథే అయినప్పటికి దర్శకుడు గోకుల్ తనదైన స్క్రీన్ ప్లేతో అలరించాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినప్పటికీ సెకండాఫ్ లో హారర్ సన్నివేశాలు, హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కార్తీ ఎంట్రీ సీన్ నుంచి 10 నిమిషాల వరకూ కథపై ఆసక్తి నెలకొల్పిన దర్శకుడు అనవసర సమయంలో వచ్చే పాట, దెయ్యం ఉందని కాష్మోరా నిరూపించే సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టించాడు. కెరీర్ లో తొలిసారిగా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి వన్ మేన్ షో గా నిలిచాడు కార్తీ. సినిమా ప్రారంభంలో క్లైమాక్స్ లో చిన్న పాప ను చూపించిన తీరు ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొంత బాగున్నప్పటికీ… మరికొన్ని సందర్భాలలో బోర్ కొట్టించింది. ఫస్ట్ హాఫ్ లో కాష్మోరా తో కథను నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలతో బాగానే అలరించాడు. ఓవరాల్ గా ‘కాష్మోరా’ సినిమా అటు కార్తి పర్ ఫార్మెన్స్, ఇటు గ్రాఫిక్స్ తో అలరిస్తుంది.

Rating – 3/5