'ఇజం' మూవీ రివ్యూ

Friday,October 21,2016 - 04:00 by Z_CLU

నటీ నటులు : నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు,తనికెళ్ళ భరణి పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌
సంగీతం : అనూప్‌ రూబెన్స్‌
ఎడిటింగ్‌ : జునైద్‌
బ్యానర్ : నందమూరి తారకరామారావు ఆర్ట్స్
నిర్మాత : నందమూరి కళ్యాణ్‌రామ్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్‌

కళ్యాణ్ రామ్ ను సిక్స్ పాక్ లుక్ తో చూపించి ఫస్ట్ లుక్ తో, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఇజం’. ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఏ మేరకు అలరించిందో? చూద్దాం.

6-1-1
కథ :-

దశరధ రామ్(తనికెళ్ళ భరణి) అనే జర్నలిస్ట్ ఓ కాంట్రాక్టర్ చేసిన అన్యాయాన్ని తన పెన్ పవర్ తో వెలుగులోకి తీసుకొస్తాడు. అలా భాద్యత గల జర్నలిస్ట్ జీవితాన్ని గడుపుతున్న దశరధ రామ్ పై ఓ సందర్భం లో కాంట్రాక్టర్ దాడి చేస్తాడు. ఆ దాడి లో కాళ్ళు పోగుట్టుకున్న తన తండ్రి ను చూసి ఎప్పటి కైనా జర్నలిస్ట్ అయ్యి రౌడీ ఇజం, సమాజం లో జరిగే అన్యాయాన్ని ఎదిరించాలని డిసైడ్ అవుతాడు దశరధ రామ్ కొడుకు సత్య మార్తాండ్(కళ్యాణ్ రామ్). అలా తన కుటుంబానికి జరిగిన సంఘటన ను దృష్టిలో పెట్టుకొని ఓ జర్నలిస్ట్ గా సమాజానికి ఎలా మేలు చేసాడు?
ఇతర దేశాల లో ఉంటూ చక్రం తిప్పుతున్న డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు) ను ఎదుర్కొని విదేశాల్లో ఉండే బ్లాక్ మనీ ను ఇండియా కు ఎలా రప్పించాడు? అనేది చిత్ర కధాంశం.

నటీ నటుల పనితీరు :-

కళ్యాణ్ రామ్ సరి కొత్త లుక్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో అలరించాడు. ముఖ్యంగా సిక్స్ పాక్ బాడీ తో యాక్షన్ సన్నివేశాల్లో హీరో ఇజం చూపించాడు. ఆలియా ఖాన్ పాత్ర లో అతిధి శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. మాఫియా డాన్ గా జగపతి బాబు, అక్రమ రాజకీయనాయకుడిగా పోసాని,జర్నలిస్ట్ గా తనికెళ్ళ భరణి, రైతు గా గొల్లపూడి మారుతి రావు తమ దైన నటన తో మెప్పించారు. వెన్నెల కిషోర్ తన డైలాగ్ డెలివరీ తో అలరించాడు. మిగతా వారందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

image0038-1
టెక్నీషియన్స్ పని తీరు :-

సినిమాకు తన సినిమాటోగ్రఫీ తో అందం తీసుకొచ్చాడు కెమెరామెన్ ముకేశ్. ముఖ్యంగా ఫారెన్ లొకేషన్స్ ను అద్భుతంగా చూపించారు.అనూప్ సంగీతం తో సినిమాకు ప్లస్ అయ్యాడు. భాస్కర భట్ల రాసిన ‘కనులు నావైనా’, పూరి రాసి పాడిన ‘ఇజం టైటిల్ సాంగ్’ బాగున్నాయి. ఆర్.ఆర్ బాగుంది.కొన్ని సందర్భాలలో పూరి మాటలు ఆకట్టుకున్నాయి.
ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :-

తను అనుకున్న పాయింట్, చూపించబోయే కథను సినిమా ప్రారంభంలోనే చెప్పిన పూరి… ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అప్ డేట్ అవుతున్న రౌడీయిజం గురించి చెప్తూనే తన మార్క్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో పూరి స్టైల్ హీరోను చూపించి సెకండ్ హాఫ్ లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడే హీరోగా ప్రజెంట్ చేసి అలరించాడు. ఫస్ట్ హాఫ్ లో జగపతి బాబుకి కళ్యాణ్ రామ్ కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీ, పూరి మార్క్ లవ్ ట్రాక్ ఓకే అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ లో ఇతర దేశంలో ఉండే బ్యాంక్ అఫ్ పారడైస్ అనే బ్యాంక్ లో ఉన్న బ్లాక్ మనీ ని తిరిగి ఇండియా కు రప్పించి జనాలకు పంచిపెట్టే సన్నివేశం, కళ్యాణ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసే సన్నివేశం సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రమోషన్లలో చెప్పినట్టుగానే క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. టెంపర్ సినిమాను కేవలం క్లయిమాక్స్ కోర్టు సీన్ తో ఓ మలుపు తిప్పిన పూరి జగన్నాధ్… ఇజం సినిమాలో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు. కోర్ట్ సీన్ లో కళ్యాణ్ రామ్ తో పూరి చెప్పించిన భారీ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు, సెకెండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాస్త బోర్ కొట్టించినప్పటికీ.. పూరీ తన టేకింగ్ తో దాన్ని మైమరిపించాడు. ఇక సంగీతపరంగా గతంలో ఎన్నో మెలొడీలు ఇచ్చిన అనూప్ రూబెన్స్.. ఈ సినిమాకు మాత్రం పూర్తిగా పూరీయిజంలో మునిగిపోయినట్టు కనిపించింది. ఓవరాల్ గా ఇజం సినిమాలో హీరో కల్యాణ్ రామ్ అయినప్పటికీ… సినిమా అంతా పూరీ’ఇజ’మే కనిపించింది. కమర్షియల్ ఎంటర్ టైనర్ లో కూడా ఓ చిన్న మెసేజ్ ఎక్స్ పెక్ట్ చేసే ఎమోషనల్ ప్రేక్షకులకు మాత్రం ఇది కనెక్ట్ అవుతుంది.