'నరుడా డోనరుడా' రివ్యూ

Friday,November 04,2016 - 01:00 by Z_CLU

 

నటీనటులు : సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి తదితరులు..
సినిమాటోగ్ర‌ఫీ : షానియల్ డియో
మ్యూజిక్ : శ్రీర‌ణ్ పాకాల‌
ఎడిట‌ర్ : కార్తీక శ్రీనివాస్‌
స‌మ‌ర్ప‌ణ : అన్న‌పూర్ణ స్టూడియోస్‌
నిర్మాత‌లు : వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌
ద‌ర్శ‌క‌త్వం : మ‌ల్లిక్ రామ్‌

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత సుమంత్ మళ్లీ తెరపైకొచ్చాడు. ఈసారి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘విక్కీ డోనర్’ సినిమాను రీమేక్ చేశాడు. ఆ రీమేక్ మూవీనే ‘నరుడా డొనరుడా’. ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది…. సుమంత్ కెరీర్ కు ప్లస్ అవుతుందా? ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో? చూద్దాం..

కథ :-

వీర్యదానం చేసే వారు లేక క్లినిక్ మూతపడే సమయంలో డాక్టర్ ఆంజనేయులు(తనికెళ్ళ భరణి) కు చదువు పూర్తి చేసి జులాయి గా జీవితాన్ని గడిపే విక్కీ (సుమంత్) అనే యువకుడు పరిచయం అవుతాడు. అలా పరిచయమైన విక్కీని తన క్లినిక్ కి వచ్చి వీర్యదానం చేయమని వెంటపడి వేధిస్తాడు ఆంజనేయులు. ఓ సందర్భం లో డబ్బు ఆశ చూపించి విక్కీతో వీర్యదానం చేయిస్తాడు డాక్టర్ ఆంజనేయులు. ఈ క్రమంలో పిల్లలు పుట్టక భాధ పడుతున్న పేషంట్స్ క్లినిక్ కు వచ్చినప్పుడల్లా విక్కీతో వీర్యదానం చేయిస్తాడు డాక్టర్ ఆంజనేయులు. అలా వీర్యదానం చేస్తూ జీవితాన్ని గడిపే విక్కీ… ఆశీ రాయి (పల్లవి సుభాష్) అనే బెంగాలీ అమ్మాయి ప్రేమలో పడతాడు. ప్రేమించిన అమ్మాయిని విక్కీ ఎలా పెళ్లిచేసుకున్నాడు? వీర్యదానం చేయడం వల్ల ప్రేయసితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు… ఫైనల్ గా ప్రియురాలితో విక్కీ ఎలా స్థిర పడతాడు? అనేది చిత్ర కధాంశం..

నటీనటుల పనితీరు :

వీర్యదానం చేసే యువకుడిగా టిపికల్ క్యారెక్టర్ లో టిపికల్ గా నటించి అలరించాడు సుమంత్. కథానాయికగా పల్లవి సుభాష్ ఆకట్టుకుంది. డాక్టర్ గా తనికెళ్ళ భరణి నటన అలరించింది. ముఖ్యంగా విత్తనం అంటూ తనికెళ్ల చేసిన కామెడీ, చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. సుమంత్ తల్లిగా శ్రీ లక్ష్మి, కాంపౌండర్ గా సుమన్ శెట్టి మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పని తీరు :

షానియల్ డియో అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు అలరించాయి. ‘నీ యెదలో’ పాట తప్ప మిగతా పాటలేవి ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదనిపించాయి.

unnamed
జీ సినిమాలు విశ్లేషణ :

దాదాపు మూడేళ్ళ తరువాత కథానాయకుడిగా రీ-ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సరికొత్త పాయింట్ తో రూపొందిన రీమేక్ నే ఎంచుకొని అలరించాడు.
వీర్యదానం చేసే యువకుడిగా తనదైన నటనతో మెప్పించాడు. తనికెళ్ళ భరణి-సుమంత్ మధ్య వచ్చే సన్నివేశాలు, క్లినిక్ లో సుమంత్ వీర్యదానం చేసే సన్నివేశాలు అలరించాయి. సోషల్ మెసేజ్ ను ఎంచుకొని రీమేక్ కథను మన నేటివిటీ కి తగినట్లు తెరకెక్కించి అలరించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. మొదటి భాగం కామెడీ తో అలరించినప్పటికీ రెండో భాగం లో కొన్ని సన్నివేశాలు అక్కడకక్కడ బోర్ కొట్టించాయి. మొదటి భాగంలో రెండో భాగంలో కొన్ని సన్నివేశాల పై కేర్ తీసుకుని… సినిమాను ఇంకాస్త కుదించి ఉంటే బాగుండేది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు. అయితే పల్లవి సుభాష్, సుమంత్ తో లవ్ ఎక్స్ ప్రెస్ చేసే సన్నివేశం బాగుంది. సినిమా ప్రారంభంలో నాగార్జున
వీర్యదానం గురించి అవగాహన పెంచే మాటలు ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ లో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ కు గురిచేశాడు. చైతూ ఎప్పీయరెన్స్ ఉందనే విషయం మ్యాగ్జిమమ్ చాలామందికి తెలీదు. ఓవరాల్ గా… ఓ కొత్త కథను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసిన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి.

 

రేటింగ్ : 3/5