'గౌతమి పుత్ర శాతకర్ణి' రివ్యూ

Thursday,January 12,2017 - 01:40 by Z_CLU

విడుదల : జనవరి 12, 2017

నటీనటులు : బాలకృష్ణ , శ్రియ, హేమమాలిని

ఇతర నటీనటులు : క‌బీర్ బేడి , శివరాజ్ కుమార్ త‌దిత‌ర‌ులు

సంగీతం : చిరంత‌న్ భ‌ట్‌

సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్

సమర్పణ: బిబో శ్రీనివాస్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాత : వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

 

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ నటించిన 100వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను శాతకర్ణి అందుకున్నాడా..?

gpsk-still-2

కథ:

శాతకర్ణి శకంలో భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రతో చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కిన సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. శాలివాహనశకంలో శాతకర్ణి చేసిన యుద్దాలు, అందుకున్న విజయాలు, ఆయన సంకల్పం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు:

గౌతమీపుత్ర శాతకర్ణి అనే యుద్ధ వీరుడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు బాలయ్య. కొన్ని సన్నివేశాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ తన నటవిశ్వరూపం చూపించి… ఈ పవర్ ఫుల్ పాత్రను తను తప్ప మరే హీరో చేయలేడేమో అనేంతగా ఆకట్టుకున్నాడు. ఇక బాలయ్య తర్వాత ఈ సినిమాకు తన నటనతో కళ తీసుకొచ్చిన నటి హేమమాలిని. గౌతమి బాలశ్రీగా హేమమాలిని నటన సినిమాకు ప్లస్. శ్రియ తన గ్లామర్, నటనతో మరోసారి ఇలాంటి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. శివరాజ్ కుమార్ ఓ సాంగ్ లో నాట్యంతో ఆకట్టుకున్నాడు. ఇక తనికెళ్ళ భరణి, శివ కృష్ణ, శుభలేఖ సుధాకర్, రవి ప్రకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఇలాంటి సినిమాలకు అన్నీ కుదిరితే ఎలాంటి విజయం సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఈ సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి. ముఖ్యంగా జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగ్స్.. తెలుగుజాతి గురించి ‘అధములం కాదు ప్రధములం’ అంటూ చెప్పే డైలాగ్స్ ‘ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా నేను అగ్ర తాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు… ‘అమ్మ’కి, ‘సమయం లేదు మిత్రమా శరణమా రణమా?’ ‘తండ్రిని మించిన కొడుకు ఉంటాడేమో కానీ తల్లి ని మించిన కొడుకు ఉంటాడా?’ అనే డైలాగ్స్ తో పాటు మరి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. చిరంతన్ భట్ మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. ముఖ్యంగా ‘ఎక్కి మీడా’, ‘సాహో సార్వ భౌమా’ పాటలు బాగా ఆకట్టుకున్నాయి. పాటలకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యం ప్రాణం పోశాయి. కొన్ని సన్నివేశాలకు రీ-రికార్డింగ్ ప్రాణం పోసింది. ఆర్ట్ వర్క్ , ఎడిటింగ్ బాగున్నాయి. దర్శకుడు క్రిష్ కథ, స్క్రీన్ ప్లే తో అలరించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

gpsk-still

జీ సినిమాలు సమీక్ష :

తన 100 సినిమా కాస్త స్పెషల్ గా ఉండాలని భావించి ఇలాంటి చారిత్రాత్మక కథను ఎన్నుకోవడమే బాలకృష్ణ సాధించిన తొలి విజయం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో కొత్త క్యారెక్టర్స్ లో ఎంటర్టైన్ చేసిన బాలయ్య తన నటపటిమతో గౌతమీపుత్ర శాతకర్ణి క్యారెక్టర్ కి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. సినిమా స్టార్టింగ్ లో కథ గురించి చెప్పి సినిమా పై క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా చాలా తక్కువ టైం లో సినిమాను రిచ్ గా తీసి, మెస్మరైజ్ చేసిన క్రిష్ ను తప్పకుండా అభినందించాల్సిందే. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు ఆయువుపట్టు గా నిలిచాయి. తన తల్లి గౌతమీ బాలశ్రీకి అగ్ర తాంబూలం ఇచ్చే సీన్, తనయుడితో యుద్దానికి వెళ్లే సీన్, విదేశాల్లో తీసిన యుద్ధసన్నివేశాలు సినిమాకు హైలైట్స్. వీటికి మంచి డైలాగ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా యాడ్ అవ్వడంతో… గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ సంక్రాంతి బరిలో సిసలైన మూవీగా నిలబడింది. ఫైనల్ గా తెలుగుజాతి గర్వించే చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చిన్నాపెద్దా తేడాలేకుండా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది.

 

రేటింగ్ : 3 /5