'ఖైదీ నంబర్ 150 ' రివ్యూ

Wednesday,January 11,2017 - 01:51 by Z_CLU

విడుదల : జనవరి 11, 2017

నటీనటులు : చిరంజీవి , కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు :  ,అలీ,  లక్ష్మి రాయ్,  బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు

ఎడిటింగ్ : గౌతంరాజు

రచన : పరుచూరి బ్రదర్స్

డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్ర, వేమా రెడ్డి

నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

సమర్పణ : సురేఖ కొణిదెల

నిర్మాత : రామ్ చరణ్ కొణిదెల

స్క్రీన్ ప్లే  దర్శకత్వం : వి.వి.వినాయక్

మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. తమిళ్ లో ఘనవిజయం సాధించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు మెగాస్టార్. మరి ఈ సినిమాతో చిరు మళ్ళీ ప్రేక్షకులను మెప్పించగలిగాడా… చిరంజీవిలో అప్పటి గ్రేస్, ఎనర్జీ లెవెల్స్ అలానే ఉన్నాయా.. జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

khaidi-still

కథ :

కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను(చిరంజీవి) కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకొని హైదరాబాద్ వస్తాడు కత్తి శీను . అక్కడి నుంచి పోలీసులుకు దొరకకుండా బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో బ్యాంకాక్ వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను అచ్చం తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేర్చి శంకర్ ను తన పేరుతో జైలు కి పంపించి శంకర్ లా మారతాడు కత్తి శీను. అలా శంకర్ లా మారిన కత్తి శీను ఏం చేశాడు? అసలు శంకర్ ఎవరు? అతని పై హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది ? అనేది సినిమా.

 

నటీనటుల పనితీరు

ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మెగాస్టార్ నుంచే స్టార్ట్ చేయాలి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చిన చిరు… బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో తనదైన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, మాస్ డైలాగులతో ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఇక చిరు తర్వాత చెప్పుకోవాల్సింది కాజల్ గురించే. తన గ్లామరస్ యాక్టింగ్ తో మెగాస్టార్ సరసన ఆకట్టుకుంది కాజల్. విలన్ పాత్రలో తరుణ్ అరోరా, మల్లి పాత్రలో ఆలీ, డాబర్ మాన్ గా బ్రహ్మానందం, రఘుబాబు తమ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వి, ఫిష్ వెంకట్ తదితరులు వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

రత్నవేలు సినిమాటోగ్రఫీ ఖైదీకి బాగా ప్లస్ అయింది. మెగాస్టార్ ను మునుపటిలా చూపించడంతో పాటు… సాంగ్స్ లో లొకేషన్స్ ను తన కెమెరాలో అందంగా బంధించి ప్రతిభ చాటుకున్నాడు రత్నవేలు. సినిమాకు మరో మేజర్ ఎస్సెట్ దేవిశ్రీ మ్యూజిక్. పాటలతో పాటు ఆర్.ఆర్ కూడా బాగా వచ్చింది. ముఖ్యంగా అన్ని పాటలతో పాటు ‘నీరు నీరు’ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ పాటకి రామజోగయ్య అందించిన సాహిత్యం బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ పరవాలేదు. ఇక పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్, వేమారెడ్డి రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మెయిన్ గా ‘కష్టం వస్తదో కార్పొరేట్ సిస్టం వస్తదో? రాని అనే డైలాగ్ తో పాటు ‘పొగరు నా ఇంట్లో ఉంటది హీరోయిజం నా వంట్లో ఉంటది’ , ‘గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు అన్నీ చూసిన వాడిని’, ‘వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు’ అంటూ రైతుల గురించి చెప్పే డైలాగ్స్, ‘మీరు లంచాలు తీసుకొని బలిసిపోయారు నేను నేరాలు చేసి అలిసిపోయా..’,అనే డైలాగ్ తో పాటు తన రీ ఎంట్రీ గురించి ‘ఎంత కాలితే అంత వెలుగుతా’,’ఆ నవ్వే వాళ్ళకి చెప్పు ఏడ్చే రోజు వస్తుందని’ అంటూ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయక్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. రామ్ చరణ్ నిర్మాతగా మారి నిర్మించిన ఈ మొదటి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

khaidi-2

జీ సినిమాలు సమీక్ష :

దాదాపు 10 ఏళ్ల తర్వాత తనకు సరిపడే మంచి పాయింట్ ను సెలెక్ట్ చేసుకోవడం మెగా స్టార్ మొదటి విజయం అని చెప్పొచ్చు. రీఎంట్రీ ఇవ్వడానికి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న కథ కావడంతో ఎన్ని కథలు విన్నా ఈ కథకే ఓటేశాడు మెగాస్టార్. సినిమాలో డ్యూయల్ రోల్ కూడా ఉండడంతో, రీఎంట్రీకి ఇదే పర్ ఫెక్ట్ మూవీ అని చిరంజీవి భావించడంలో అస్సలు తప్పులేదు. ఇక మెగాస్టార్ అనగానే గుర్తొచ్చేవి స్టెప్స్. చాలా ఏళ్ల తరువాత మళ్ళీ తన స్టెప్స్ తో ఫాన్స్ లో జోష్ తీసుకొచ్చి ప్రతీ సాంగ్ లో తనదైన సిగ్నేచర్ స్టెప్ తో విజిల్స్ వేయించాడు చిరు. కార్పొరేట్ సంస్థలపై ఒక సామాన్య వ్యక్తి పోరాడే సీన్స్ లో శంకర్ గా… అలాగే మాస్ ను ఎట్రాక్ట్ చేసే సీన్స్ లో కత్తి శీను గా మరో సారి మెస్మరైజ్ చేసాడు మెగాస్టార్. ‘నీరూరు’ గ్రామం లో రైతుల కోసం శంకర్ పోరాటం చేసిన సీన్… ఆ సీన్స్ చూస్తూ కత్తి శీను ఎమోషనల్ అయ్యే సీన్, సిటీ మొత్తానికి నీళ్లు రాకుండా చేసే సీన్, పల్లె టూరి గురించి రైతుల గురించి మీడియా ముందు చిరు చెప్పే సీన్, కాయిన్ ఫైట్, అలి-బ్రహ్మానందం కామెడి,అమ్మడు కుమ్ముడు సాంగ్ సినిమాకు హైలైట్స్. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ… ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు మాత్రం ఖైదీ నంబర్ – 150లో ఏదో వెలికి కనిపిస్తుంది. ఎక్కడో ఎమోషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఒరిజినల్ తో పోలిస్తే ఎక్స్ టార్డనరీ పొలిటికల్ సీన్స్, ఎమోషనల్ స్పీచ్ లు తగ్గించేశారు. ప్లస్సులు, మైనస్ లు పక్కనపెడితే… ఓవరాల్ గా ఇది మెగా స్టార్ రీఎంట్రీ మూవీ. టోటల్ సినిమాను తన భుజాలపై మెగాస్టార్ నడిపించారు. ఈ సంక్రాంతికి ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఖైదీ నంబర్-150 సినిమాను తప్పక చూడొచ్చు.

రేటింగ్ : 3 /5