'అప్పట్లో ఒకడుండే వాడు' రివ్యూ

Friday,December 30,2016 - 06:58 by Z_CLU

విడుదల : డిసెంబర్ 30 , 2016

నటీ నటులు : నారా రోహిత్, శ్రీ విష్ణు, తనియా హోప్

సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్

మ్యూజిక్ : సాయి కార్తీక్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు

సమర్పణ : నారా రోహిత్

నిర్మాతలు : ప్రశాంతి, కృష్ణ విజయ్

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సాగర్ కె చంద్ర

 

విభిన్న సినిమాలతో ఎంటర్టైన్ చేసే నారా రోహిత్ ముఖ్య పాత్రలో శ్రీ విష్ణు హీరో గా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘అప్పట్లో ఒకడుండే వాడు’ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో? చూద్దాం..

కథ :

క్రికెటర్ అవ్వాలనుకొనే రైల్వే రాజు(శ్రీ విష్ణు) కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల గ్యాంగ్ స్టార్ గా మారతాడు . అలా గ్యాంగ్ స్టార్ గా మారిన రైల్వేరాజు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ(నారా రోహిత్) ను డీ కొడతాడు. ఇంతకీ క్రికెటర్ గా ఎదగాలనుకున్న రైల్వే రాజు గ్యాంగ్ స్టార్ గా మారడానికి కారణం ఏమిటి? అసలు రైల్వే రాజ్ కి ఇంతియాజ్ కి మధ్య ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు :

రైల్వే రాజ్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు నటన బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు విష్ణు. ఇక ఇంతకు ముందు పవర్ పోలీస్ పాత్రలో అలరించిన నారా రోహిత్ మరో సారి ఇంతియాజ్ అనే క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. హీరోయిన్ తనియా తన పర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. విలన్స్ గా జీవ, అజయ్ మెప్పించారు. ఇక బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, సత్య దేవ్, షాషా సింగ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు :

సినిమాకు తన కెమెరా తో కళ తీసుకొచ్చాడు సినిమాటోగ్రాఫర్ నవీన్ యాదవ్. ఇక సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్లస్. సాయి కార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. కొన్ని డైలాగ్స్ అలరించాయి. సాగర్ చంద్ర కథ-స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

గతం లో శివాజీ -రాజేంద్ర ప్రసాద్ లతో ‘అయ్యారే’ సినిమా తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ దర్శకుడు సాగర్ కె చంద్ర కాస్త గ్యాప్ తీసుకొని 90 లో జరిగే కథ ను ఎంచుకొని క్యూట్ స్క్రీన్ ప్లే తో అలరించాడు. ముఖ్యంగా నైంటీస్ లో జరిగే సంఘటనలతో కూడిన సీన్స్ కథ లో ఒక్కో క్యారెక్టర్ ను ఎంటర్ చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, శ్రీ విష్ణు-నారా రోహిత్ మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్స్. కాస్త స్లో గా సాగే స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్. సెకండ్ హాఫ్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగే కథ లో ట్విస్ట్ తో కూడిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఓవరాల్ గా అప్పట్లో జరిగిన సంఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది.

 

రేటింగ్ : 3 /5