'ఇంట్లో దెయ్యం నాకేం భయం' రివ్యూ

Friday,December 30,2016 - 05:09 by Z_CLU

విడుదల : డిసెంబర్ 30 , 2016

నటీ నటులు : అల్లరి నరేష్‌, కృతిక, మౌర్యాని

ఇతర నటీ నటులు : బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి,సన, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు

సంగీతం : సాయికార్తీక్‌

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : డైమండ్‌ రత్నబాబు

సమర్పణ : భోగవల్లి బాపినీడు

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర

నిర్మాత : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి.

కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్ అల్లరి నరేష్ హీరోగా కృతిక,మౌర్యాని హీరోయిన్స్ గా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’. ప్రస్తుతం కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు జి.నాగేశ్వరావు దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. మరి కెరీర్ లో తొలి సారి గా హారర్ ఎంటర్టైనర్ లో నటించిన అల్లరి నరేష్ ఈ సినిమాతో ఎలా ఎంటర్టైన్ చేసాడో? చూద్దాం.

intlo-deyyam-nakem-bhayam

కథ :-

పెళ్లిళ్లకు బ్యాండ్ కొట్టే నరేష్(అల్లరి నరేష్) ఒకానొక సందర్భంలో ఇందుమతి(కృతిక) అనే అమ్మాయి ను చూసి ప్రేమ లో పడతాడు. అదే సమయంలో నరేష్ ఓ పాప ప్రాణాలను కాపాడడం చూసి నరేష్ ప్రేమ లో పడుతుంది ఇందుమతి. ఇంతలో తన అప్పు తీర్చడానికి డబ్బు అవసరం అయిన నరేష్ ఓ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించే ఫేక్ మాంత్రికుడి అవతారం ఎత్తుతాడు. కోరికలు తీరకుండా చనిపోయి దెయ్యం గా మారి ఆ బంగ్లా లో ఉన్న స్వప్న(మౌర్యాని) నరేష్ కి ఏమవుతుంది? చివరికి ఆ బంగ్లా లో ఉన్న దెయ్యాన్ని నరేష్ బయటికి పంపించగలిగాడా? లేదా అనేది ఈ సినిమా కధాంశం.

నటీనటుల పనితీరు :

నరేష్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ తన దైన కామెడీ స్కిల్స్ తో ఎంటర్టైన్ చేసాడు. స్వప్న అనే దెయ్యం క్యారెక్టర్ లో మౌర్యాని నటన బాగుంది. అటు గ్లామర్ క్యారెక్టర్ తో పాటు మరో వైపు దెయ్యం క్యారెక్టర్ లో కూడా తన నటన, గ్లామర్ తో అలరించింది మౌర్యాని . ఇందుమతి క్యారెక్టర్ లో కృతిక పరవాలేదనిపించుకుంది. షకలక శంకర్-చమ్మక్ చంద్ర కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. బ్రహ్మానందం క్యారెక్టర్ నవ్వించలేక పోయింది ఇక రాజేంద్ర ప్రసాద్, ,చలపతి రావు, జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, ప్రభాస్ శ్రీను,ప్రగతి,సన తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

unnamed-1

టెక్నీషియన్స్ పనితీరు :

హారర్ సినిమాలంటే ముందు గుర్తొచ్చేది బ్యాగ్రౌండ్ స్కోర్ ఇదే సినిమాకు కీలకం కూడా. సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించాయి. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. డైమండ్ రత్నం మాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో కామెడీ డైలాగ్స్ నవ్వించాయి. స్టోరీ-స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండడం కాస్త మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

unnamed

జీ సినిమాలు సమీక్ష :

మూడేళ్ళ నుంచి టాలీవుడ్ లో హారర్ కామెడీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకొని హిట్స్ సాధించగా మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇక మొన్నటివరకూ కామెడీ హీరోగా ఎంటర్టైన్ చేసిన అల్లరి నరేష్… ఈ సినిమాతో ఫస్ట్ టైం ఈ జానర్ లోకి ఎంటరయ్యాడు. హారర్ కథల్లో కామెడీ పుట్టించిన సినిమాలు ఇప్పటికే హిట్ అవ్వడంతో అల్లరోడు కూడా అద్భుతంగా కామెడీ పండించి ఉంటాడనే అంచనాలతో చాలామంది థియేటర్లకు వచ్చారు. అయితే గత సినిమాలతో పోల్చిచూస్తే ఇందులో కామెడీ చమక్కులు కాస్త తక్కువే ఉన్నప్పటికీ… ఓవరాల్ గా మాత్రం నిరాశపరచదు. ఫస్ట్ హాఫ్ లో షకలక శంకర్-చమ్మక్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, చలపతి రావు లతో కూడిన కొన్ని హారర్ కామెడీ సీన్స్, అల్లరి నరేష్ యాక్టింగ్, మౌర్యాని పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్స్. రొటీన్ స్టోరీ-స్క్రీన్ ప్లే , సినిమా చూస్తున్నంత సేపు చాలా తెలుగు హారర్ కామెడీ సినిమాలు గుర్తుకురావడం… అన్నింటికంటే ముఖ్యంగా సినిమాలో సిగ్నేచర్ కామెడీ సీన్లు మిస్ అవ్వడం పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే అక్కడక్కడ అల్లరోడి చమక్కులు, మరికొన్ని కామెడీ సీన్స్ తో ఇంట్లో దెయ్య జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

 

రేటింగ్ : 2 .5  /