జీ సినిమాలు - ఒకే రోజు 9 సినిమాలు

Saturday,May 30,2020 - 07:38 by Z_CLU

ఆ ఇంట్లో – ఉదయం 6 గం.లకు
నటీనటులు : చిన్నా, మయూరి,
ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : చిన్న
ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి
రిలీజ్ డేట్ : 2009
చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

=========================

అవును 2 – ఉదయం 8 గం.లకు
నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే
ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015
రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================

శివగంగ – ఉదయం 10 గం.లకు
నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి
ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్
డైరెక్టర్ : V.C. వడివుడియన్
ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్
రిలీజ్ డేట్ : మార్చి 4, 2016
శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

===============================

డోర – మధ్యాహ్నం 12 గంటలకు
నటీనటులు : నయనతార, తంబి రామయ్య
ఇతర నటీనటులు : హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త
మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి
ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్
రిలీజ్ డేట్ : 31 మార్చి 2017
అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

===================================

తుంబ – మధ్యాహ్నం 2 గంటలకు
నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్
ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి
డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.
ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019
అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================

సుబ్రమణ్యపురం – మధ్యాహ్నం 4 గంటలకు
నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : సురేష్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఆలీ, సురేష్, జోష్ రవి, భద్రం గిరి, మాధవి, హర్షిని, TNR తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి
ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

================================

కిల్లర్ – సాయంత్రం 6 గంటలకు
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్
సంగీతం : సైమన్ కే కింగ్
సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ : మాక్స్
ఎడిటర్ : రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

==================================

హోటల్ ముంబయి – రాత్రి 8 గంటలకు
నటీనటులు : దేవ్ పటేల్, అర్మీ హమీర్
ఇతర నటీనటులు : నజానిన్ బొనైదీ, అనుపమ్ ఖేర్, జాసన్ ఐజాక్స్, సుహైల్ నాయర్
మ్యూజిక్ డైరెక్టర్ : వోల్కర్
డైరెక్టర్ : ఆంటోనీ మారస్
ప్రొడ్యూసర్ : గ్యారీ హామిల్టన్, మైక్ గాబ్రే, జూలీ రియాన్, ఆండ్రూ
రిలీజ్ డేట్ : నవంబర్ 29, 2019
ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై జరిగిన దాడిని కథాంశంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా హోటల్ ముంబయి. సర్వైవింగ్ ముంబయి అనే డాక్యుమెంటరీని ఆధారంగా చేసుకొని ఈ ఇంటర్నేషనల్ మూవీని తీశారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాకు చెందిన ప్రొడక్షన్ కంపెనీలు ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై, అవార్డులు అందుకుంది.

==================================

కుక్కలున్నాయి జాగ్రత్త – రాత్రి 10 గంటలకు
నటీనటులు : సిబిరాజ్, అరుంధతి
ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్
డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్
ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్
రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014
సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.