సర్కారు వారి పాట స్టార్ట్ చేసిన మహేష్

Sunday,May 31,2020 - 09:53 by Z_CLU

మహేష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. సర్కారు వారి పాట ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు సూపర్ స్టార్. తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా డీటెయిల్స్ ను బయటపెట్టాడు.

టైటిల్ పోస్టర్ తో పాటు మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. ఈసారి మహేష్ చెవిపోగు పెట్టాడు. మెడపై రూపాయి కాయిన్ టాటూ కూడా పెట్టాడు. ఇలా కొత్త సినిమాలో తన గెటప్ కాస్త కొత్తగా ఉండబోతోందనే విషయాన్ని బయటపెట్టాడు మహేష్.

పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

సినిమా ఎనౌన్స్ మెంట్ లో భాగంగా కొంతమంది టెక్నీషియన్స్ ను కూడా ఫైనలైజ్ చేశారు. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నాడు. ఇంతకుముందు మహేష్ నటించిన దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు సినిమాలకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. అలవైకుంఠపురములో లాంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ తర్వాత ఆటోమేటిగ్గా మహేష్ ఛాయిస్ తమన్ వైపు వెళ్లింది.

ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్డే లేదా కియరా అద్వానీలో ఒకర్ని ఫైనలైజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.