అభిమానులతో మహేష్ లైవ్ చాట్

Saturday,May 30,2020 - 01:06 by Z_CLU

లాక్ డౌన్ నేపథ్యంలో స్టార్ హీరోలు సోషల్ మీడియాను వాడుకుంటూ అభిమానులతో లైవ్ చాట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో సూపర్ స్టార్ కూడా చేరబోతున్నాడు. అవును, రేపు మహేష్ అభిమానులతో లైవ్ చాట్ చేయబోతున్నాడు. రేపు మహేష్ కి స్పెషల్ డే. తండ్రి కృష్ణ బర్త్ డే కావడంతో అదే రోజు అభిమానులతో ముచ్చటించాలని నిర్ణయించుకున్నాడు.

రేపు సాయంత్రం 5 గంటలకు తన ఇనస్టాగ్రామ్ లో UrstrulyMahesh ఐడీ ద్వారా మహేష్ లైవ్ చాట్ లోకి వచ్చి అభిమానులతో ఛాట్ చేసి, వారిని ఖుషి చేయనున్నాడు. ఇక ఉదయం మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ తో పాటు పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఆ సినిమా సంగతులు కూడా మహేష్ లైవ్ ద్వారా అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం, మహేష్ కొత్త సినిమా అప్డేట్ , మహేష్ లైవ్ చాట్ వీటన్నిటితో రేపు మహేష్ ఫ్యాన్స్ కి నిజంగా పండగే.