జీ సినిమాలు (మార్చి 27)

Thursday,March 26,2020 - 08:12 by Z_CLU

పంచాక్షరి
నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

=========================

కథానాయకుడు
నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్,
M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

============================

గోరింటాకు
నటీనటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్
ఇతర నటీనటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ
శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

===========================

ఇద్దరమ్మాయిలతో
నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్
ఇతర నటీనటులు: బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

===============================

బ్రూస్ లీ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

============================

ఒక్కడొచ్చాడు
నటీనటులు : విశాల్, తమన్నా
ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సూరజ్
ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్
రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.