ZeeCinemalu - April 11

Saturday,April 10,2021 - 09:21 by Z_CLU

kathakali-zee-cinemalu-384x640-384x640
కథాకళి
నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా
ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : పాండిరాజ్
రిలీజ్ డేట్ : 18 మార్చి 2016
విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

=====================

robo-2pointO-robo-2-512x298-512x298

2.0
నటీనటులు : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్
విడుదల : 29 నవంబర్ 2018
450 వందల కోట్ల బడ్జెట్ … 3D టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో..ఇవన్నీ కలిసి 2.Oను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశాయి. కథ విషయానికొస్తే.. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. సరిగ్గా అప్పుడే
డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్)
ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని చిట్టి ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’.

=====================

lie-zee-cinemalu-586x276

లై
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్
కనకాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017
‘లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.

=======================

shiva-linga-zee-cinemalu-469x640

శివలింగ
నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్
ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్
రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

=======================

bhayya-zee-cinemalu1-551x320-551x320

భయ్యా
నటీనటులు : విశాల్, ప్రియమణి
ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : భూపతి పాండ్యన్
ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్
రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007
హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

========================

okkadochadu-zee-cinemalu-551x320

ఒక్కడొచ్చాడు
నటీనటులు : విశాల్, తమన్నా
ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సూరజ్
ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్
రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016
డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

– Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics