జీ సినిమాలు (జూన్ 7th)

Wednesday,June 06,2018 - 09:00 by Z_CLU

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి
ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్
డైరెక్టర్ : V.C. వడివుడియన్
ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్
రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

________________________________________________________

ప్రేమించుకుందాం రా

నటీ నటులు : వెంకటేష్, అంజలా జవేరి
ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ
ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

________________________________________________

పిల్ల జమీందార్

నటీ నటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

_________________________________________________

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

____________________________________________________

ఏక్ నిరంజన్

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్
ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్
రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

_______________________________________________

మైసమ్మ IPS

నటీ నటులు : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే
ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ
డైరెక్టర్ : భరత్ పారెపల్లి
ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు
రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు.ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది. మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.