'కాలా' రిలీజ్... సూపర్ స్టార్ మొదలెట్టేసాడు

Thursday,June 07,2018 - 06:16 by Z_CLU

‘కాలా’ సినిమాతో ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్…  ఈరోజే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేసాడు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రజినీ ఓ  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఈరోజు డార్జిలింగ్ లో మొదలైంది.

ఇప్పటికే డిఫరెంట్ మూవీస్ తో డైరెక్టర్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజు రజినీ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డార్జిలింగ్ లో ఓ వారం పాటు షూట్ చేసి అనంతరం చెన్నై లో  రెండో షెడ్యూల్ ను జరపనున్నారు.  సన్ పిక్చర్స్ బ్యానర్ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.