Interview - అల్లరి నరేష్ (బంగారు బుల్లోడు)

Thursday,January 21,2021 - 02:37 by Z_CLU

రెండు రోజుల్లో మళ్ళీ తన మార్క్ కామెడీ సినిమాతో థియేటర్స్ లో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బంగారు బుల్లోడు’ గా వస్తున్నాడు అల్లరి నరేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా జనవరి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటించాడు ఆ విశేషాలు నరేష్ మాటల్లోనే….

– ఆలస్యానికి అదో కారణం

‘బంగారు బుల్లోడు’ సినిమా మధ్యలో ఉండగా ‘మహర్షి’ సినిమా ఆఫర్ వచ్చింది. మహర్షిలో రవి క్యారెక్టర్ కోసం గెడ్డం పెంచాను. ఇందులో గెడ్డం ఉండదు. దాని వల్ల ఓ మూడు నాలుగు నెలలు బంగారు బుల్లోడు ఆలస్యం అయ్యింది. అన్ని పనులు పూర్తి చేసి 2020 సమ్మర్ కి రిలీజ్ చేయాలనుకున్నాం. ఈ లోపు కరోనా ఎంటరై మా ప్లాన్ అంతా తారుమారు చేసింది. సో ఫైనల్ గా ఇప్పుడు సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. ఫీలింగ్ హ్యాపీ నవ్.

– ఐదేళ్ళ తర్వాత

విలేజ్ కామెడీ సినిమా చేసి ఐదేళ్ళవుతుంది. మళ్ళీ ఈ సినిమా కోసం పల్లెటూర్లకు వెళ్ళడం జరిగింది. రాజోల్ , అంతర్వేది తో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిఊర్లల్లో షూట్ చేశాం. మళ్ళీ పల్లెటూరిలో షూట్ చేయడం నాకే కొత్తగా అనిపించింది. కచ్చితంగా ఆడియన్స్ కూడా చాలా ఏళ్ల తర్వాత కంప్లీట్ విలేజ్ కామెడీ సినిమా చూస్తున్నామని ఫీలవుతారు.

– కథలో వచ్చే కామెడీ

డైరెక్టర్ గిరి గారు నా ‘బెండు అప్పారావు RMP’ సినిమాకు కథ అందించారు. ఆ తర్వాత కూడా చాల కథలు వినిపించారు కానీ ఏది సెట్ అవ్వలేదు. ఒకరోజు ఈ గోల్డ్ స్కామ్ మీద కథ రాసుకున్న ఈ కథ చెప్పారు. ఇద్దరికీ బాగా నచ్చింది. అందుకే ఫైనల్ గా ఈ సినిమాతో మళ్ళీ కలిశాం.

– రియల్ ఇన్సిడెంట్ తో

రాజమండ్రిలో జరిగిన ఓ గోల్డ్ స్కామ్ ను ఆధారంగా చేసుకొని డైరెక్టర్ గిరి గారు ఈ కథ రాసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ పేపర్ క్లిప్ చూసి తన స్టైల్ లో ఈ కథను సిద్దం చేసుకొని పూర్తి ఎంటర్టైన్ మెంట్ సినిమాగా తీర్చిదిద్దారు.

bangaru bullodu

– ఇప్పటి వరకు ఎవరు చేయలేనిది

సినిమాలో గోల్డ్ తయారు చేసే గోల్డ్ స్మిత్ పాత్ర చేశాను. ఆ క్యారెక్టర్ కోసం కొంచెం హోమ్ వర్క్ చేశా. ఎందుకంటే ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి కానీ ఇది వరకు చేతులతోనే చేసేవారు. చేతితో చేసే చిన్న పనులు బాగా అబ్సర్వ్ చేసి నేర్చుకొని ఈ క్యారెక్టర్ చేశాను. నాకు తెలిసి ఏదైనా సినిమాలో జస్ట్ చిన్న ఎలిమెంట్ కోసం ఎవరైనా ఈ పాత్ర చేసి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో గోల్డ్ స్మిత్ పాత్ర చేసింది నేనే అనుకుంటున్నా.

– రీమిక్స్ ఆయన ఐడియానే

సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ నేను చేసిన పాత్రతో పాటు కథకు కూడా ‘బంగారు బుల్లోడు’ అనే టైటిలే యాప్ట్ అనిపించింది. నేను డైరెక్టర్ గారు అనిల్ గారికి చెప్పగానే ఆయన వెంటనే ఓకె అన్నారు. బంగారు బుల్లోడు అనగానే “స్వాతిలో ముత్యమంత”పాట గుర్తొస్తుంది. ఆ సాంగ్ ను మళ్ళీ రీమిక్స్ చేద్దామన్నారు. సో ఫైనల్ గా ఆ రీమిక్స్ ఆలోచన అనిల్ గారిదే.

bangaru bullodu

– బాగా డీల్ చేసాడు

డైరెక్టర్ గిరి గారు సినిమాను బాగా డీల్ చేసారు. నాన్న గారితో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ తో కామెడీ సన్నివేశాలను ఆయన స్టైల్ లో తీసే ప్రయత్నం చేసారు. అందుకే ట్రైలర్ చూస్తే అందరికి నాన్న గారితో నేను చేసిన పాత సినిమాలు గుర్తొస్తాయి. సెట్స్ కూడా వద్దని ఒరిజినల్ లోకేషన్స్ లోనే సినిమాను షూట్ చేశాడు. కథలో నేచురాలిటీ మిస్ అవ్వకుండా సినిమాను రూపొందించారు.

– సాయి కార్తీక్ కి ఛాలెంజే

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తో నాకిది ఐదో సినిమా. ఈ సినిమాలో ‘స్వాతిలో ముత్యమంత’ రీమిక్స్ ను చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఎక్కడ చెడగొట్టకుండా ట్యూన్ చేశాడు. సినిమాలో ఆ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది.

 

– నా కోసమేనా..? అని అడిగా

నాన్న గారి దగ్గర వర్క్ చేసిన డైరెక్టర్స్ ముందుగా ఒక ఫీడ్ బ్యాక్ కోసం నాకు కథలు చెప్తూ ఉంటారు. విజయ్ కూడా నాకు బాగా పరిచయం. ఒకరోజు కలిసి ‘నాంది’ అనే కథ చెప్పాడు.మొత్తం విన్నాక బాగుంది ఎవరితో చేస్తున్నావ్ అని అడిగా. మీతోనే అన్నాడు. జెనరల్ గా నాకు అందరు కామెడీ కథలు చెప్తారు నువ్వేంటి ఇలాంటి సీరియస్ కథ తీసుకోచ్చావ్ అని అడిగా.. లేదండీ ఇది మీరు చేస్తే మీతో పాటు ఆడియన్స్ కి కూడా కొత్తగా ఉంటుంది అన్నాడు.అలా నాంది కి నాంది పడింది.

– ఆదరణ ఎప్పుడు తగ్గదు

కామెడీ కి ఆదరణ ఎప్పుడు తగ్గదు. మనల్ని ఎంత కొత్తగా ఎంటర్టైన్ చేసిన కామెడీ లేకపోతే కామెడీ లేదు అనుకుంటాం. ఇప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారి , నరేష్ గారి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తాం. లేటెస్ట్ గా F2 ఎంత పెద్ద హిట్టయిందో కూడా చూసాం. కామెడీ కథను పర్ఫెక్ట్ గా తీస్తే జనాలు ఎప్పుడు ఆదరిస్తారు. ఇంతకముందు నేను చేసిన సినిమాల్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అందుకే సరిగ్గా ఆడలేదు. ఇకపై ఏడాదికి ఒక్క కామెడీ సినిమా అయినా చేస్తాను.

bangaru bullodu

– రెండు కామెడీ అయితే ఒకటి ప్రయోగం

ఇకపై ఎదాడిదికి మూడు సినిమాలు చేస్తే అందులో రెండు కామెడీ అయితే ఒకటి కచ్చితంగా నాంది లాంటి ప్రయోగాత్మక సినిమా చేస్తాను. ఎంత నవ్వించినా నటుడిగా గుర్తింపు రావాలంటే మనం ఎదగాలంటే ఏదో ఒక కొత్త కథతో సినిమా చేస్తుండాలి. అందుకే నాంది లాంటి ఎక్స్ పర్మెంట్స్ ఇకపై మరిన్ని చేస్తాను.

– రిలీజ్ కి రెడీ

నాందికి సంబంధించి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

– మూడు సినిమాలు ఫైనల్ చేసుకున్నా

ప్రస్తుతం ‘బంగారు బుల్లోడు’ సినిమాతో పాటు నాంది రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా. లాక్ డౌన్ లో మూడు కథలు లాక్ చేసి పెట్టుకున్నా. అందులో ఇద్దరు కొత్త వాళ్ళతో సినిమాలు చేయబోతున్నాను. అలాగే నంది దర్శకుడు విజయ్ కూడా ఇంకో కథ చెప్పాడు.

– ఆ సినిమా రీమేక్ చేయాలనుంది.

లాక్ డౌన్ లో చాలా సినిమాలు చూశాను. అందులో లూట్ కేస్ అనే సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుంది. ప్రొడ్యూసర్ అనిల్ గారితో ఆ రీమేక్ గురించి డిస్కస్ చేశాను.