అల్లు అర్జున్ లైవ్ పెర్ఫార్మెన్స్?

Monday,December 30,2019 - 11:56 by Z_CLU

ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్న రూమర్ ఇది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ లైవ్ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం మనం. సిల్వర్ స్క్రీన్ పై డాన్సులతో మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈసారి ప్రేక్షకుల ముందు స్టేజ్ పై చిందేయబోతున్నాడు. అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్, దీనికి వేదిక కాబోతోంది.

బన్నీ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. సామజవరగమన సాంగ్ అయితే, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ స్థానంలో మ్యూజికల్ కన్సర్ట్ పెట్టాలని నిర్ణయించారు. జనవరి 6న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ వేదికపై తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కుదిరితే ఇదే వేదికపై బన్నీ ఓ పాటకు డాన్స్ చేయాలని అనుకుంటున్నాడట.

త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.