వెంకీ మామతోనే పండగ స్టార్ట్ అవుతుంది

Monday,December 09,2019 - 12:30 by Z_CLU

డిసెంబర్ 13 వెంకీ బర్త్ డే.. డిసెంబర్ 25 క్రిస్మస్.. జనవరి 1 న్యూ ఇయర్.. జనవరి 14 సంక్రాంతి.. ఇలా ఈ ఫెస్టివల్స్ అన్నీ వెంకీమామతోనే ప్రారంభమౌతాయంటున్నారు విక్టరీ వెంకటేష్. నాగచైతన్య, రాశిఖన్నాతో కలిసి జీ సినిమాలు కు ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు.

వెంకటేష్
ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, సాంగ్స్.. ఇలా అన్నీ కుదిరాయి. మామ-అల్లుడు ఎమోషన్ చాలా బాగా వచ్చింది. బాబి స్క్రిప్ట్ బాగా రాసుకున్నాడు. సంక్రాంతి కంటే ముందే వెంకీమామతో రియల్ పండగ స్టార్ట్ కాబోతోంది.

నాగచైతన్య
టీజర్ రిలీజైన తర్వాత చాలామంది ఫోన్ చేసి మీ బాండింగ్ చాలా బాగుందన్నారు. మామ-అల్లుడు సినిమాకు ఇంత క్రేజ్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. ఈ టైపు సినిమా వచ్చి చాన్నాళ్లయిందనే విషయం అప్పుడే తెలిసింది. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలవుతున్నారు. మామఅల్లుడు రిలేషన్ షిప్ ఎప్పుడూ బాగుంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్.

రాశిఖన్నా
మామ-అల్లుడుతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దర్శకుడు బాబి మంచి క్యారెక్టర్స్ రాశారు. సినిమా ఫస్టాఫ్ లో చాలా కామెడీ ఉంటుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. నటిస్తున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇక సెకండాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇది అందరి సినిమా.