Interview - నాగ చైతన్య (బంగార్రాజు)

Wednesday,January 12,2022 - 05:37 by Z_CLU

కింగ్ నాగార్జున , యవ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండుగ సినిమా అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమా గురించి హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు చైతూ మాటల్లోనే..

‘మనం’ చేసేటప్పుడు భయం ఉంది 

మన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నటించాలంటే కొద్దిగా భయం ఉంటుంది. ‘మనం’ చేసేటప్పుడు తాత , నాన్న లతో నటించడం భయంగా ఉండేది. యాక్షన్ అన్నప్పుడు నాన్న ముందు నటించడం కష్టం అనిపించింది.  తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు బంగార్రాజు తో మొత్తం ఫ్రీ అయిపోయి ఓపెన్ అయి నటించాను.

నాన్న తో పాటు కళ్యాణ్ ని కూడా అడిగా

ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాన్నని అలాగే కళ్యాణ్ ని చాలా డౌట్స్ అడిగాను. బికాజ్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. పైగా నేను సీక్వెల్ చేయడం ఇదే మొదటి సారి. నేను నా క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు నాకున్న డౌట్ అడిగి క్లారిటీ తీసుకొని హోం వర్క్ చేశాను. సోగ్గాడే సినిమాను కూడా మళ్ళీ మళ్ళీ చూసి ఓన్ చేసుకున్నాను.  ముఖ్యంగా నాన్న నుండి వాయిస్ రికార్డ్ తీసుకొని చాలా రిహార్సల్స్ చేశాను.

ఒక మెట్టు ఎక్కువే 

సినిమాలో నాన్న కి నాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నాన్న క్యారెక్టర్ ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. బంగార్రాజు క్యారెక్టరే మెయిన్. సినిమాలో చిన్న బంగార్రాజు ఎక్స్ట్రా గా యాడ్ అవుతాడు అంతే. కథంతా నాన్న, రమ్య గారే నడిపిస్తుంటారు. టీజర్ , ట్రైలర్ లో మాత్రం నా విజువల్సే ఎక్కువ ఉండేలా కట్ చేశారు.

 bangarraju nagarjuna nagachaitanya

బంగార్రాజు మనవడిగా 

సినిమాలో నేను బంగార్రాజు మనవడిగా కనిపిస్తాను. సోగ్గాడే చిన్ని నాయన లో నేను పుట్టిన చూపిస్తారు. ఈ పార్ట్ లో పెరిగి పెద్దయ్యాక చిన్న బంగార్రాజు లా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాను. అప్పుడు బంగార్రాజు కిందకి వచ్చి నన్ను ఎలా కంట్రోల్ చేశాడు అనేది మిగతా కథ. రాము పాత్ర కూడా ఉంటుంది కానీ అమెరికాలో ఉన్నట్టు చూపిస్తాం. నేను తనతో ఫోన్ లో మాట్లాడటం లాంటివి ఉంటాయి. కథలో గుడికి సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది.

కొత్తగా కనిపిస్తాను 

ఈ సినిమాలో నన్ను కంప్లీట్ వేరియేషన్ తో చూస్తారు. పల్లెటూరిలో ఉండే మాస్ కుర్రాడిగా కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ కోసం అలాంటి సినిమాలన్నీ చూడటం మొదలు పెట్టాను.  సినిమాల నుండే నేర్చుకొని ఈ క్యారెక్టర్ చేశా.  అదే ఈ సినిమాకు సంబంధించి నా స్పెషల్ హోం వర్క్.

సాంగ్స్ లో మాత్రమే 

కథలో మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ అంటే కృతిశెట్టి మాత్రమే. మిగతా హీరోయిన్స్ అంతా సాంగ్స్ లోనే కనిపిస్తారు. సీన్స్ లో ఎవరూ కనిపించరు. సాంగ్స్ స్విచువేషణ్ కంటే సరదాగా జరిగేట్టుగా ఉంటాయి.  ఒక ఫెస్టివల్ మూడ్ లోనే జరుగుతుంటాయి.  ఆ ఫ్లేవర్ కోసం మంది హీరోయిన్స్ కనిపిస్తారు అంతే.

 bangarraju nagachaitanya krithi shetty

ప్రతీ సాంగ్ లో… డాన్స్

సినిమాలో ప్రతీ సాంగ్ లో ఓ మంచి కోరియోగ్రఫీ ఉంటుంది. నేను ఇంతముందు చేసిన సినిమాల్లో మొదటి సాంగ్ లో మాత్రమే డాన్స్ చేసే వాడిని ఇందులో మాత్రం నాలుగు సాంగ్స్ లో డాన్స్ చేసే స్కోప్ ఉండింది. అలాగే మంచి కోరియోగ్రఫీ కుదిరింది. బాగా ఎంజాయ్ చేశాను.

పండగ సినిమా.. ఇవన్నీ ఉండాల్సిందే 

బంగార్రాజు సంక్రాంతి పండగ కోసం చేసిన సినిమా పండుగ సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాల్సిందే. ఫైట్స్ , సాంగ్స్ , డ్రామా , ఫన్ , కామెడీ , లవ్ ఇలా అన్ని కలగలిపిన ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. అనూప్ మా ఫ్యామిలీ సినిమాలకు ఎప్పుడూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. ఈసారి బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. థియేటర్స్ ఆ సాంగ్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇది డిఫరెంట్ 

నేను ఇప్పటి వరకూ చేసిన రొమాంటిక్ లవ్ ఫిలిమ్స్ వేరు. ఈ సినిమా వేరు. ఇప్పటి వరకూ నేను చేసిన రొమాంటిక్ సినిమాల్లో రియాలిటీగా ఉంటుంది. కానీ ఇందులో నాకు నాగ లక్ష్మి కి ఒక వార్ జరుగుతుంటుంది. నేనెంత అల్లరి చేస్తానో తను కూడా అంతే అల్లరి చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య ఒక హానెస్ట్ లవ్ ట్రాక్ ఉంటుంది. లవ్ ట్రాక్ లో రెండు షేడ్స్ ఉంటాయి.

 laddunda-first-single-from-bangarraju-out-nagarjuna-nagachaitanya-ramyakrishna-krithishetty

ఎంటర్టైన్ మెంట్ తగ్గదు 

సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కి కొదవే లేదు. ప్రతీ పది నిమిషాలకు తమాషా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళని కూడా సినిమా కచ్చితంగా సాటిస్ఫై చేస్తుందని నా నమ్మకం.

సంక్రాంతికి ఫస్ట్ టైం 

సంక్రాంతి సీజన్ లో ఇప్పటి వరకూ నా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇదే మొదటి సారి. కొంచెం నర్వెస్ నెస్ తో పాటు ఎగ్జైటింగ్ గా ఉంది. ఇది కంప్లీట్ ఫెస్టివల్ సినిమా.  సంక్రాంతి కోసమే డిజైన్ చేసిన చేసిన సినిమా ఇది.  నాన్న స్టార్టింగ్ నుండి అదే చెప్తూ వచ్చినట్టే అనుకున్న ఫెస్టివల్ డేట్ కి రిలీజ్ అవుతోంది.

చాలా హడావుడిగా చేశాం 

నాలుగు సంవత్సరాల క్రితమే నాన్నకి ఈ సీక్వెల్ ఐడియా ఉంది.  నేను నాన్న వేరే వేరు ప్రాజెక్ట్స్ చేస్తుంటాం.  ఇద్దరి డేట్స్ కలిసి అడ్జస్ట్ చేసే టైంకి కోవిడ్ వచ్చింది. సో రెండేళ్ళు అక్కడే అయిపోయింది. చాలా లేట్ గా సెప్టెంబర్ లో షూట్ స్టార్ట్ చేశాం.  అక్కడి నుండి ఒకే ఒక్క సింగిల్ షెడ్యుల్ లో కంప్లీట్ చేశాం. లాస్ట్ మూమెంట్ లో కొంచెం హడావుడి అయ్యింది. బట్ మేము అనుకున్న విధంగానే సినిమా వచ్చింది విత్ బెస్ట్ క్వాలిటీ.

 

ఇంకో సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉంది 

సినిమాలో నా ఫేవరేట్ సాంగ్ “వాసి వాడి తస్సాదియ్యా”. నాన్నతో కలిసి వర్క్ చేస్తూ ఎంజాయ్ చేసిన సాంగ్ అది. అలాగే ఇంకో సాంగ్ ఉంటుంది. దక్షకి నాకు మధ్య వచ్చే సాంగ్. సినిమాలో వచ్చే మొదటి సాంగ్ అది. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను.

సినిమా హైలైట్స్ లో అదొకటి

టెంపుల్ లో ఒక సునామి వచ్చి శివుడి విగ్రహాన్ని తాకే ఓ సీక్వెన్స్ ఉంటుంది. సినిమా ఓపెనింగ్ లో వచ్చే సీక్వెన్స్ అది. సినిమా హైలైట్స్ లో అదొకటి. సినిమాకు గ్రాఫిక్స్ కూడా వాడాము. కానీ ఈ సీక్వెన్స్ కి  మినీయేచర్ వెళ్దామని ఫిక్స్ అయ్యారు.

టికెట్ రేటుని బట్టే బడ్జెట్ 

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల గురించి ఏప్రిల్ లో జీవో వచ్చింది.  మేము ఆగస్ట్ లో షూట్ స్టార్ట్ చేశాం.  సో మనం ఈ సినిమాకి బడ్జెట్ వేసినప్పుడు ఉన్న టికెట్ రేట్లని దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ వేసుకున్నాం. నాన్న ఈ స్విచువేషణ్ ని కంప్లీట్ అర్థం చేసుకొని ప్లానింగ్ తోనే ఈ సినిమా నిర్మించారు.  రేపు ఏమైన టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్ అవుతుంది.

మా విడాకుల విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ చేశారు

సమంత, నాకు జరిగిన విడాకుల విషయంలో మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. ఇద్దరి మంచి కోసం తీసుకున్న డిసీషన్ అది.  తనూ నేనూ ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. ఈ స్విచువేషణ్ లో ఇద్దరికీ ఇదే బెస్ట్ డిసీషన్ అనుకున్నాం.

 

నెక్స్ట్ సినిమాలు అవే 

నా నెక్స్ట్ సినిమా థాంక్యూ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ షెడ్యుల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఫారెన్ లో చేయాల్సి ఉంది. ఈ మంత్ ఎండింగ్ లో వెళ్తున్నాను. విక్రం కుమార్ తోనే మళ్ళీ ఓ హారర్ బ్యాక్ డ్రాప్ లో వెబ్ సిరీస్ చేస్తున్నాను. పరశురాం గారితో మహేష్ గారి సినిమా అవ్వగానే ఒక సినిమా చేస్తున్నాను. నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతో ట్రావెల్ అవుతున్నాను. ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics