జీ సినిమాలు ( 3rd ఫిబ్రవరి )

Sunday,February 02,2020 - 10:02 by Z_CLU

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి
ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ : ఈశ్వర్
ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008


అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

సైజ్ జీరో
నటీనటులు : అనుష్క శెట్టిఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఊర్వశిసోనాల్ చౌహాన్అడివి శేష్బ్రహ్మానందంగొల్లపూడి మారుతి రావుతనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015
అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసంఅతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

దేవదాస్

నటీనటులు : నాగార్జున అక్కినేనినానిరష్మిక మండన్నఆకాంక్ష సింగ్ 

ఇతర నటీనటులు : R. శరత్ కుమార్కునాల్ కపూర్నవీన్ చంద్రనరేష్సత్య కృష్ణన్మురళీ శర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018

దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.

మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికిదాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్దేవ కలిశారా లేదా..విలన్లుపోలీసులు ఏమయ్యారుమధ్యలో రష్మికఆకాంక్షల స్టోరీ ఏంటిఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

==============================================================================

బ్రదర్స్
నటీనటులు : సూర్య శివకుమార్కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ఇషా శర్వాణివివేక్సచిన్ ఖేడ్కర్తార
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : K.V.ఆనంద్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 2012
సూర్యకాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.