ఎంత మంచివాడవురా టీజర్ రివ్యూ

Wednesday,October 09,2019 - 11:36 by Z_CLU

కల్యాణ్ రామ్ కొత్త సినిమా ఎంత మంచివాడవురా. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. దసరా శుభాకాంక్షలతో రిలీజైన ఈ టీజర్ లో కల్యాణ్ రామ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు.

శివ, ఆచార్య, బాలు, సూర్య, రిషి.. ఇలా రకరకాల పేర్లతో హీరో క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అందరితో మంచోడు అనిపిస్తూనే, కల్యాణ్ రామ్ తో మాస్ ఫైట్స్ చేయించారు. పైగా అతడితో రాముడు కూడా మంచోడే కానీ రావణాసుడ్ని చంపాడు అనే డైలాగ్ ను మాసీగా చెప్పించారు. సో.. సినిమాలో కల్యాణ్ రామ్ క్యారెక్టర్
క్లాస్-యాక్షన్ మిక్స్ తో ఉంటుందనే విషయాన్ని సూటిగా చెప్పారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. టీజర్ చివర్లో చూపించిన షాట్ మరో ఎత్తు. పచ్చటి పంట పొలాల మధ్య తనికెళ్ల భరణి, కల్యాణ్ రామ్ బండిపై వెళ్లే సీన్, అక్కడొచ్చే డైలాగ్ బాగా ఎట్రాక్ట్ చేసింది. అదే సీన్ లో సంక్రాంతికొస్తున్నాం అనే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్టయింది.

కల్యాణ్ రామ్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నారు.