జీ సినిమాలు ( 9th ఫిబ్రవరి )

Saturday,February 08,2020 - 10:03 by Z_CLU

సుబ్రహ్మణ్యపురం

నటీనటులు : సుమంత్ఈషా రెబ్బ

ఇతర నటీనటులు : సురేష్తనికెళ్ళ భరణిసాయి కుమార్ఆలీసురేష్జోష్ రవిభద్రం గిరిమాధవిహర్షిని, TNR తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి

ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

_________________________________________

స్టూడెంట్ నం 1

నటీనటులు : N.T.R., గజాల

ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : S.S. రాజమౌళి

ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001

ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.

________________________________________________

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్, తమన్నా

ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

_________________________________________________

స్పైడర్

నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017


ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.

అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.