జీ సినిమాలు (20th మార్చ్)

Thursday,March 19,2020 - 10:09 by Z_CLU

డోర

నటీనటులు : నయనతార, తంబి రామయ్య

ఇతర నటీనటులు హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త

మ్యూజిక్ డైరెక్టర్ దాస్ రామసామి

ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్

రిలీజ్ డేట్ : 31 మార్చి 2017

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే.

____________________________________________

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్కార్తీక నాయర్
ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడిఅభినయభానుప్రియనాజర్సుమన్బ్రహ్మానందంకోట శ్రీనివాస రావుసంపత్ రాజ్కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

____________________________________________

స్పైడర్

నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్

ఇతరనటీనటులు :S.J. సూర్యభరత్RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే

మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్

డైరెక్టర్ : A.R. మురుగదాస్

ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017


ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.

అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

___________________________________

బుర్రకథ

న‌టీనటులుఆది సాయికుమార్‌మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి

ఇతర నటీనటులు :  నైరా షారాజేంద్ర‌ప్ర‌సాద్‌పోసాని కృష్ణ‌ముర‌ళిప‌థ్వీరాజ్‌గాయ‌త్రి గుప్తాఅభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సంగీతం సాయికార్తీక్‌

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు

నిర్మాత‌హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌

రిలీజ్ డేట్జూన్ 28, 2019

అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలామరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.

ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).

ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరుఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయిందిహీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుందిఅసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడుప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

_________________________________________

అ..ఆ

నటీనటులు నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

____________________________________

విశ్వామిత్ర

నటీనటులు : ప్రసన్న, నందితా రాజ్

ఇతర నటీనటులు : ఆషుతోష్ రానా, సత్యం రాజేష్, విద్యుల్లేఖ రామన్, జీవ, సత్య  మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్స్ : మాధవి అద్దంకి, S. రజినీకాంత్, ఫణి తిరుమలశెట్టి

రిలీజ్ డేట్ : 14 జూన్ 2019

అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. ఆమె అంటే అందరికీ ఇష్టమే. ఆఫీస్ లో ఆమె బాస్ మాత్రం నందితను మరో రకంగా చూస్తుంటాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నందిత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు సమస్య ఎదురైన ప్రతిసారి ఓ అజ్ఞాతవ్యక్తి వచ్చి రక్షిస్తుంటాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.

నందితకు పోలీసాఫీసర్ ప్రసన్న మంచి ఫ్రెండ్. మాటల సందర్భంలో ఓసారి తన అజ్ఞాత స్నేహితుడి గురించి ప్రసన్నకు చెబుతుంది. నందిత ఎలాంటి అమ్మాయో, ఎంత అమాయకురాలో తెలుసు కాబట్టి ఆమె మోసపోకూడదనే ఉద్దేశంతో, ఆ అజ్ఞాత స్నేహితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసన్న.

ఎంక్వయిరీలో భాగంగా ప్రసన్న, నందితకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నందితను అతడు పదేపదే ఎందుకు రక్షిస్తుంటాడు? తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రసన్న తెలుసుకున్న రహస్యాలేంటి? చివరికి నందిత తన అజ్ఞాత స్నేహితుడ్ని కలుసుకుందా లేదా అనేది క్లయిమాక్స్.