జ్వాలా రెడ్డిగా తమన్న.. ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,February 08,2020 - 01:19 by Z_CLU

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

తరుణ్ అరోర విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి గా మిల్కీబ్యూటి తమన్నా లుక్ ని ఈరోజు ఉదయం 9:24 నిమిషాలకి విడుదలచేసింది చిత్ర యూనిట్.

మిల్కీబ్యూటి తమన్నా మాట్లాడుతూ – “వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్స్‌పైరింగ్ మరియు ఛాలెంజింగ్ రోల్ కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి. గోపిచంద్ గారితో ఫస్ట్ టైమ్ క‌లిసి నటిస్తున్నాను. అలాగే సంపత్ నంది గారి దర్శకత్వంలో `రచ్చ`, `బెంగాల్ టైగర్` తర్వాత చేస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – “రాజ‌మండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ఈ షెడ్యూల్ లో తమన్నా జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్ లో సంపత్ నంది గారు హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు“ అన్నారు.