జీ సినిమాలు (20th ఫిబ్రవరి)

Friday,February 19,2021 - 10:15 by Z_CLU

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురిశీలు అబ్రహాంరమేష్ పిషరోదిసాజు నవోదయఅక్షర కిషోర్ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసంసమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందనిఅందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

_____________________________________

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ : సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటిరాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారుఅనేది ఈ సినిమా కథాంశం.

_________________________________________

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీరాజేంద్ర ప్రసాద్కబెర్ దుహాన్ సింగ్రవి కిషన్సాయి కుమార్మురళీ మోహన్తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన  సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

____________________________________

స్పైడర్

నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : A.R. మురుగదాస్

ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017

ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.

అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

_____________________________________

ఏజెంట్ భైరవ 

నటీ నటులు : విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు

దర్శకత్వం: భరతన్

నిర్మాత : బెల్లం రామకృష్ణ

విడుదల : 7 జులై 2017

ఇళయ దళపతి విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా జగపతిబాబు విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్ భైరవ’. పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకం బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. భరతన్‌ దర్శకుడు.

________________________________________

హైపర్

నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా

ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.