జీ సినిమాలు (7th మార్చ్)

Friday,March 06,2020 - 10:05 by Z_CLU

ABCD

నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్

ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ

డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి

ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని

రిలీజ్ డేట్ : 17th మే 2019

న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.

అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

____________________________________

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ : సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారనేది ఈ సినిమా కథాంశం.

__________________________________________

చూడాలని ఉంది

నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ : అశ్విని దత్

రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998

తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

____________________________________________

కందిరీగ

నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011


ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

______________________________________________________

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్

ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి

డైరెక్టర్ : వక్కంతం వంశీ

ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 2018

సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు.

అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్)కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..అసలు సూర్యకు కృష్ణంరాజుకు  సంబంధం ఏంటి తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

________________________________

లై

నటీనటులు నితిన్, మేఘా ఆకాష్

ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ హను రాఘవపూడి

ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017  

లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.