రామాయణంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Saturday,March 07,2020 - 10:54 by Z_CLU

దాదాపు ఏడాది కిందటే అఫీషియల్ గా ప్రకటించారు రామాయణం ప్రాజెక్ట్. గీతాఆర్ట్స్, ప్రైమ్ ఫోకస్ బ్యానర్లతో పాటు మధు మంతెన నిర్మాతగా ఈ సినిమా రానుంది. దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను నితీష్ తివారీ డైరక్ట్ చేయబోతున్నారు. చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఆ ప్రాజెక్టుపై తాజాగా నితీష్ స్పందించాడు.

“సినిమాకి సంబంధించిన పనులు ఇంకా ఏవీ ఓ కొలిక్కి రాలేదు. హిందీ, తెలుగు, తమిళంలో త్రీడిలో తీయబోయే ఈ సినిమాలో నటీనటులు ఎవరనేది ఇంకా చర్చించలేదు. ఇదొక పాన్‌ ఇండియా చిత్రం కనుక జాగ్రత్తగా ఆలోచించి తీయాలని నిర్ణయించుకున్నాం. లేటెస్ట్ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకొని సినిమా తీస్తే చాలా బాగుంటుంది.”

ఈ సినిమాకు సంబంధించి రాముడిగా రామ్ చరణ్ పేరు ప్రముఖంగా వినిపించింది. మరో కీలకమైన పాత్ర కోసం సల్మాన్ పేరు కూడా వినిపించింది. అయితే అవేవీ ఇంకా ఫిక్స్ అవ్వలేదంటున్నాడు నితీష్.

“ఇప్పటికే కొంతమంది నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. కానీ అవి ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటు, మరెంతో కష్టంతో రాబోతోంది. అందుకే ప్రతి విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరినాటికి సినిమా సెట్స్‌పైకి తీసుకురావడనికి ప్రయత్నాలు చేస్తాం.”