జీ సినిమాలు ( 3rd జూలై)

Sunday,July 02,2017 - 10:03 by Z_CLU

తోడికోడళ్లు

హీరో హీరోయిన్లు – సురేష్, మాలాశ్రీ

ఇతర నటీనటులు – సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ

సంగీత దర్శకుడు –  రాజ్ కోటి

నిర్మాత –  డాక్టర్ డి.రామానాయుడు

దర్శకుడు – బోయిన సుబ్బారావు

విడుదల తేదీ – 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

============================================================================

భాయ్

నటీనటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

 

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

చంటి

హీరో హీరోయిన్లు – రవితేజ,  చార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతం – శ్రీ

దర్శకత్వం – శోభన్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

జాదూ గాడు  

హీరో హీరోయిన్స్ : నాగ శౌర్య, సోనారిక

ఇతర నటీ నటులు : ఆశిష్ విద్యార్థి, అజయ్, జాకీర్ ఉస్సేన్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృద్వి రాజ్, కోట శ్రీనివాస రావు

సంగీతం :సాగర్ మహతి

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్

దర్శకత్వం : యోగి

అప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ సౌర్య  పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘జాదూ గాడు’.  ఈ చిత్రం తో హీరో నాగ సౌర్య ను సరి కొత్త కోణం లో ఆవిష్కరించి అలరించాడు దర్శకుడు యోగి. యాక్షన్ సన్నివేశాలతో పాటు  కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్, సాగర్ మహతి అందించిన పాటలు హైలైట్స్.   శ్రీనివాస్ రెడ్డి. పృద్వి, రమేష్, సప్తగిరి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. నాగశౌర్య సరసన కథానాయికగా నటించిన సోనారిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

==============================================================================

బ్రదర్స్

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : K.V.ఆనంద్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.

==============================================================================

 

విలేజ్ లో వినాయకుడు

నటీనటులు : కృష్ణుడు, శరణ్య మోహన్, వీరేంద్ర నాథ్ యండమూరి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : సాయి కిరణ్ అడివి

ప్రొడ్యూసర్ : మహి V రాఘవ్

రిలీజ్ డేట్ : 5 నవంబర్ 2009

కృష్ణుడు హీరోగా నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ ‘విలేజ్ లో వినాయకుడు’. శరణ్య మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లో కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకుడు.