జీ సినిమాలు ( 10th అక్టోబర్ )

Tuesday,October 09,2018 - 10:01 by Z_CLU

అభినేత్రి

నటీనటులు : ప్రభు దేవాతమన్నాసోను సూద్అమీ జాక్సన్

ఇతర నటీనటులు : సప్తగిరిమురళి శర్మపృథ్వి

మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్ వాజిద్

డైరెక్టర్ :  ఎ.ఎల్.విజయ్

ప్రొడ్యూసర్ :  గణేష్ప్రభుదేవా

రిలీజ్ డేట్ : అక్టోబర్ 7, 2016 

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడుకథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన  సినిమా ‘అభినేత్రి’.

==============================================================================

సీతారాముల కల్యాణం  లంకలో

నటీనటులు నితిన్హన్సిక
ఇతర నటీనటులు సుమన్సలీమ్చంద్ర మోహన్ప్రగతిబ్రహ్మానందంవేణు మాధవ్ఆలీ, M.S.నారాయణసుబ్బరాజుదువ్వాసి మోహన్జయ ప్రకాష్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ ఈశ్వర్
ప్రొడ్యూసర్ మల్ల విజయ్ ప్రసాద్
రిలీజ్ డేట్ జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడుఆప్రేమను దక్కించుకోవడానికితను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏంచేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో సినిమాలో యాక్షన్సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

బ్రహ్మోత్సవం

నటీనటులు : మహేష్ బాబుసమంత రుత్ ప్రభుకాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్నరేష్సత్యరాజ్జయసుధరేవతిశుభలేఖ సుధాకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్గోపీ సుందర్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ ప్రసాద్ V. పొట్లూరి

రిలీజ్ డేట్ :  20 మే 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరోతన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

గీతాంజలి

నటీనటులు : అంజలిశ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్హర్షవర్ధన్ రాణేబ్రహ్మానందంఆలీరావు రమేష్సత్యం రాజేష్శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

 

బ్రూస్ లీ

నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

==============================================================================

నెక్స్ట్ నువ్వే

నటీనటులు : ఆదివైభవి

ఇతర నటీనటులు : బ్రహ్మాజీరశ్మి గౌతమ్హిమజ, L.B. శ్రీరామ్శ్రీనివాస్ అవసరాలరామ్ జగన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రభాకర్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజాబన్నివాస్

రిలీజ్ డేట్ నవంబర్ 3, 2017

ఆదివైభవి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ నెక్స్ట్ నువ్వే. కిరణ్ (ఆది) తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ నడుపుతుంటాడు. అయితే మిస్టీరియస్ గా ఆ రిసార్ట్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళంతా చనిపోతుంటారు. ఆది & ఫ్రెండ్స్ కి ఏం చేయాలో అర్థంకాక ఆ శవాలను ఎవరికీ తెలియకుండా పూడ్చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ రిసార్ట్ లో పనిచేసే వ్యక్తి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కథ అడ్డం తిరుగుతుంది.

ఎవరైతే ఆ రిసార్ట్ లో ఇప్పటి వరకు చనిపోయారోవారి వివరాలను పరిశీలించిన పోలీసులుఅవన్నీ ఆల్రెడీ చనిపోయిన వారి వివరాలని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. చనిపోయినవాళ్ళు మళ్ళీ చనిపోవడమేంటి..అసలు ఆ రిసార్ట్ కి వరసగా వచ్చిన వాళ్ళెవరు..వారికి ఆ రిసార్ట్ కి ఉన్న సంబంధమేంటి అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.