జీ సినిమాలు ( 2nd జనవరి )

Tuesday,January 01,2019 - 10:03 by Z_CLU

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన ఐశ్వర్య షిందోగి, మదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ : లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

కొత్త బంగారు లోకం 

నటీనటులు : వరుణ్ సందేశ్శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్జయసుధఆహుతి ప్రసాద్రజితబ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

బాలు

హీరో హీరోయిన్లు పవన్ కళ్యాణ్శ్రియ శరన్నేహ ఒబెరాయ్

ఇతర నటీనటులు : గుల్షన్సుమన్జయసుధతనికెళ్ళ భరణిసునీల్బ్రహ్మానందంఎం.ఎస్.నారాయణ తదితరులు 

సంగీతం మణిశర్మ

దర్శకత్వం : కరుణాకరన్

నిర్మాత : అశ్విని దత్

విడుదల తేది : 6 జనవరి  2015

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్  డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

=============================================================================

సైనికుడు

నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ :  హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.