జీ సినిమాలు ( 13th డిసెంబర్ )

Thursday,December 12,2019 - 10:03 by Z_CLU

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

శ్రీమంతుడు
నటీనటులు మహేష్ బాబుశృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

బలుపు
నటీ నటులు : రవితేజశృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్  : 28 జూన్ 2013
రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==============================================================================

బాబు బంగారం

నటీనటులు : వెంకటేష్నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్మురళీ శర్మజయప్రకాష్బ్రహ్మానందంపోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్  జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని),  మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ  ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడుచివరికి కృష్ణ  ఇద్దరి ఆట ఎలా కట్టించాడుఅనేది చిత్ర కధాంశం.

=============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017


ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.