
మేము
నటీనటులు : సూర్య, అమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015
పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.
=============================================================================

కళ్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.
==============================================================================

కథానాయకుడు
నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008
ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.
==============================================================================

రాఖీ
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006
NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.
==============================================================================

కూలీ నం 1
నటీనటులు : వెంకటేష్, టాబూ
ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు, శారద, మోహన్ బాబు, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, బాబు మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా
డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : D. సురేష్
రిలీజ్ డేట్ : 12 జూన్ 1991
వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.
==============================================================================

బలుపు
నటీ నటులు : రవితేజ, శృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్ : 28 జూన్ 2013
రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.