రజనీకాంత్ 'పేట' ట్రయిలర్ రిలీజ్

Wednesday,January 02,2019 - 12:09 by Z_CLU

ఓవైపు 2.O సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అంతలోనే మరో సినిమా రెడీ చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో రజనీకాంత్ నటించిన సినిమా పేట. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. రజనీకాంత్ స్టయిల్, మేనరిజమ్స్ ను హండ్రెడ్ పర్సెంట్ ఎలివేట్ చేసింది ఈ ట్రయిలర్.

2.Oలో అక్కడక్కడ మాత్రమే కనిపించిన రజనీకాంత్ స్టయిల్ ను పూర్తిగా పేట సినిమాలో చూడొచ్చు. రజనీ స్టయిల్, డైలాగ్స్ అన్నీ పేట ట్రయిలర్ లో ఉన్నాయి. పైకి హాస్టల్ వార్డెన్ లా కనిపించే రజనీకాంత్, తెరవెనక గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. రజనీ లుక్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

కార్తీక్ సుబ్బరాజు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, మేఘా ఆకాష్ కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది పేట మూవీ.