జీ సినిమాలు (29th ఆగష్టు)

Monday,August 28,2017 - 10:06 by Z_CLU

శివ

నటీనటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

=============================================================================

కృష్ణార్జున

హీరో  హీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్

ఇతర నటీనటులు – నాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం

సంగీతం – ఎం.ఎం. కీరవాణి

దర్శకత్వం – పి.వాసు

విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

==============================================================================

గ్రీకు వీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

==============================================================================

రక్షణ

నటీనటులు : అక్కినేని నాగార్జున, శోభన

ఇతర నటీనటులు : రోజా, నాజర్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 18 ఫిబ్రవరి 1993

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కరియర్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రక్షణ. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన కోట శ్రీనివాస్ రావు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

=============================================================================

భాయ్

నటీనటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలైట్స్.