జీ సినిమాలు (6th ఏప్రిల్)

Monday,April 05,2021 - 10:00 by Z_CLU

maguvalumatrame-zeecinemalu-fpc-780x468-1-780x468

మగువలకు మాత్రమే

నటీనటులు : జ్యోతిక , ఊర్వసి , నాజర్, భాను ప్రియ , శరణ్య పోన్వన్నం
ఛాయాగ్రహణం : మణికందన్
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : సూర్య
దర్శకత్వం : బ్రహ్మ
విడుదల : 12 సెప్టెంబర్ 2020

జ్యోతిక ప్రధాన పాత్రలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని తెర‌పైన చూపిస్తూ, వాటికో పరిష్కారం చెప్పే ప్ర‌య‌త్నం ‘మగువలు మాత్రమే’. మంచి కథనంతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను సూర్య నిర్మించారు. బ్రహ్మ దర్శకత్వం వహించిన జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

________________________________

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

________________________________________

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_________________________________________

okato-number-kurradu-ఒకటో-నంబర్-కుర్రాడు-zeecinemalu-580x320

ఒకటో నంబర్ కుర్రాడు

నటీనటులు : తారకరత్న, రేఖ
ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : కోదండరామిరెడ్డి
ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002

తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

______________________________________________

అర్జున్ సురవరం

తారాగణం: నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019

అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం . లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.

_______________________________________

శకుని

నటీనటులు : కార్తీ, ప్రణీత
ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : శంకర్ దయాళ్
ప్రొడ్యూసర్ : S. R. ప్రభు
రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.