జీ సినిమాలు ( 24th జనవరి )

Thursday,January 23,2020 - 10:02 by Z_CLU

డోర

నటీనటులు : నయనతార, తంబి రామయ్య

ఇతర నటీనటులు హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త

మ్యూజిక్ డైరెక్టర్ దాస్ రామసామి

ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్

రిలీజ్ డేట్ : 31 మార్చి 2017

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

==============================================================================

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ

ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : J.B.

డైరెక్టర్ : ప్రభాకర్ P.

ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు

రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.

అయితే ఒకసారి తనకొచ్చిన ఓ  మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================================================================

విన్నర్

నటీనటులు సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

=============================================================================

లీడర్
నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్
రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010
రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.

==============================================================================

మోహిని
నటీనటులు త్రిషజాకీ భజ్ఞాని
ఇతర నటీనటులు : ముకేష్ తివారీపూర్ణిమ భాగ్యరాజ్యోగి బాబుజాంగిరి మధుమితజ్ఞానేశ్వర్స్వామినాథన్ మరియు తదితరలు
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ – మెర్విన్
డైరెక్టర్ : రమణ మాదేశ్
ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.
సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.
గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలనిఅవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.

==============================================================================

బుర్రకథ

న‌టీనటులుఆది సాయికుమార్‌మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి

ఇతర నటీనటులు :  నైరా షారాజేంద్ర‌ప్ర‌సాద్‌పోసాని కృష్ణ‌ముర‌ళిప‌థ్వీరాజ్‌గాయ‌త్రి గుప్తాఅభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సంగీతం సాయికార్తీక్‌

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు

నిర్మాత‌హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌

రిలీజ్ డేట్జూన్ 28, 2019

అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలామరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.

ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).

ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరుఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయిందిహీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుందిఅసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడుప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.