ఏప్రిల్ 10 న నాగార్జున సినిమా

Friday,January 24,2020 - 10:02 by Z_CLU

1983 ప్రపంచ క్రికెట్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా 83. అయితే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయనున్నాడు నాగార్జున. ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడాడు నాగార్జున.

`క్రికెట్ జ‌గ‌త్తులో 1983లో మ‌న దేశం గొప్ప విజ‌యాన్ని సాధించింది. ఈ విజయంతో మ‌న దేశంలో క్రికెట్ ఓ మతం అనేంత గొప్ప‌గా మ‌మేక‌మైంది. ఈ ప్ర‌యాణం గురించి చెప్పే చిత్ర‌మే `83`. ఈ జ‌ర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. క్రికెట్ ప్ర‌పంచంలో విశ్వ‌విజేత ఉన్న వెస్టిండీస్ జ‌ట్టును ఓడించి భార‌తదేశం తొలిసారి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్‌ను గెలుచుకుంది. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ ద్వారా విడుద‌ల చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉందిఅన్నారు. 

ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్, నటిస్తుండగా ఆయన భార్య రోమీ పాత్రలో దీపికా పాడుకొనే నటిస్తుంది. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.